Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. చెల్లెలిగఁ దల్లిగనుఁ బరస్ర్తినిఁదలుపఁ
బోకఁ గామాంధకారానఁ గన్ను మిన్నుఁ
గానకుండగ వర్తింప ఁ గడకువంశ
నాశనంబది తథ్యమా నరమృగాలఁ
జూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!
భావం: పరస్ర్తిని చెల్లిగా, తల్లిగా, భావించే సంస్కృతి మనది. కొంతమంది కామాంధకారంతో కళ్లు మూసుకునిపోయి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. చివరికి అలాంటివారికీ వంశనాశనం తప్పదనడానికి ఉదాహరణలుకోకొల్లలుగా ఉన్నాయి. కర్మసాక్షియైన ఓ సూర్యదేవా! నీవైనా లోకానికి తెలియజేయుమా!
తే.గీ. రోజురోజుకు మితిమీరేనీ జగాన
అకట! నరరూప రాక్షసులాగడాలు
కఠినమగు శిక్షలను వేయఁ గల్గినంత
జంకుదురు తప్పుఁ జేయరే జన్మలోనఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: అయ్యో! నరరూప రాక్షసుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. కఠినాతి కఠినమైన శిక్షలు వేయగల్గిన పక్షంలో ఆ దుర్మార్గులు భయపడడంతో పాటు మరే జన్మలోను తప్పు చేయబోరన్న వాస్తవాన్ని కర్మసాక్షి వైన ఓసూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించవయ్య స్వామి.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262