Others

బ్రహ్మచర్యాదీక్షాపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనస్సెపుడూ బ్రహ్మమందే చరిస్తూ ఉండడమే బ్రహ్మచర్యమన్నారు. ప్రాచీన ఋషులు మనిషి జీవితాన్ని బ్రహ్మచర్యం, గార్హ్యస్థం, వానప్రస్థం, సన్న్యాసం అని నాలుగు భాగాలుగా విభజించారు. మనిషి జీవితంలో బ్రహ్మచర్య దీక్షాసమయం బాల్యం నుండి పాతిక సంవత్సరాల వయస్సు వరకు అంటారు. అది విద్యార్థి దశ. కానీ, ప్రతి వ్యక్తి నింరతరం బ్రహ్మచర్యవ్రతమాచరించగలిగితే నిజతత్త్వం తెలసుకుని పరమాత్మానుభూతి పొందగలడని అనేకమంది మహనీయులు అనుభవ పూర్వకంగా తెలిపారు.
ప్రతి వ్యక్తి దైహిక ఇంద్రియ సుఖాలకు, మానసికంగా కూడా శృంగారకాంక్షలకు దూరంగా ఉంటూ సత్యానే్వషిగా నిరంతరం పరమాత్మ యందే మనస్సు నిలిపియుంచి, తాను కేవలం దేహం కానని, తాను ఒక దివ్యకాంతిస్వరూపమనే ఎరుకతో ఉండాలి. బ్రహ్మచర్యవ్రతం మనిషికొక అద్భుత శక్తినిస్తుంది. ఆనందం కలిగి, సృజనాత్మకత సిద్ధిస్తుంది. వీర్యనష్టం వలన ఏకాగ్రత చెడుతుంది. చెడు అలవాట్లు పతనం చేస్తాయి. శృంగారకాంక్ష ఆహారంలో రుచిని గురించిన ధ్యాస, సుగంధ వాసనల పట్ల మమకారం వదులుకోవాలి. తానుజ్ఞానం పొంది జీవాత్మ పరమాత్మల ఏకతాభావం పొందగలిగే సాధన చేయాలి. ఈ సాధన మొదట కష్టమన్పించినా, అసాధ్యం కాదని స్వీయానుభావంతో ఎంతోమంది తెల్పియున్నారు.
మనసా, వాచాకర్మణాల తన కోరికను చంపుకుని, ఇంద్రియనిగ్రహం కలిగి, మనస్సును దైవం పైన సమాజసేవ పైనా నిలిపి ఉంటే బ్రహ్మం వశమవుతుంది. వ్యక్తే దైవంగా మారుతాడు. బ్రహ్మచర్యం వలన చాలా లాభాలున్నాయి.వీర్యవృద్ధి తో బాటు,మానసిక ప్రశాంతత, స్వచ్ఛత, పవిత్రత, ఏకాగ్రత నైతికశక్తి, శరీరిక బలం కలిగి ముఖం తేజోవంతం అవుతుంది. తేజస్సు, ఓజస్సు పెరిగి వ్యక్తి ఆరోగ్యవంతుడు, దీర్ఘాయుష్కుడు అవుతాడు.
ప్రతిబాలునికి సంపూర్ణ బ్రహ్మచర్యమాచరించే శిక్షణ నివ్వాలి. అప్పుడతనికి విశ్వాసము, శద్ధ్రాసక్తులు పెరుగుతాయి. మనస్సు, వచస్సు, కర్మణలతో నిరంతర సచ్ఛీల భావంతో ఉండటమే బ్రహ్మచర్యం. అపవిత్రాలోచన అపవిత్రచర్య కంటే చెడునైనది అన్నారువివేకానంద ఒకసారి.
ఉపనయనం బ్రహ్మచర్యానికి ఆరంభం. అది సమావర్తనంలో ముగుస్తుంది. సమావర్తనమంటే బయలుదేరిన చోటుకే తిరిగిరావడం. గురుసాన్నిధ్యంలో విద్య పూర్తి చేసుకొని, భిక్షాటనతో లేదా విద్యాప్రదర్శనతో ధనం సంపాదించి గురుదక్షిణ చెల్లించి ఇంటికి తిరిగి రావడమే సమావర్తనం. సమావర్తనానంతరం. అవివాహితుడుగా ఉండేవాడు. స్నాతకుడు. కాశీయాత్ర చేసినవాడితడే. ఇట్లు ‘ఉపనయనం’ మొదలుకొని స్నాతకపర్యతం భిక్షాచరణ చేస్తూ వ్రతానుష్ఠాన మూలంగా బుద్ధికి చురుకుదనం సాధించి వేదాధ్యయనం చేస్తూ పూజ, స్నా ఔపోసనాదికాలు తెలుసుకొనడమే బ్రహ్మచర్యం అన్నారు కంచికామకోటి పీఠాధిపతులైన శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములవారు.
స్ర్తిపురుషులెవరైనా బ్రహ్మచర్యాదీక్షను స్వీకరించవచ్చు. బ్రహ్మచర్యదీక్షతీసుకొన్న పురుషులనుబ్రహ్మచారులు అంటే స్ర్తిలను బ్రహ్మచారిణులని అంటారు. ఆంజనేయస్వామి, భీష్ముడు, మీరాబాయి, సులభ, గార్గి, త్రిమతాచార్యులు, స్వామి దయానంద సరస్వతి,శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానందుడు, అరవింద ఘోష్, శ్రీరమణ మహర్షి, సాధ్వీరీతాంబరి ఇలాంటి వారంతా కూడా బ్రహ్మచర్యాన్ని దీక్షగా తీసుకొన్నవారు. పతంజలి యోగసూత్రాల్లో బ్రహ్మచర్యదీక్ష పాటిస్తున్న వారికి బ్రహ్మవర్చస్సు, వీర్యలాభం, అమానుష ప్రజ్ఞ,జితేంద్రియత్వం సిద్ధిస్తాయని చెబుతున్నాయి.

- డా. గొల్లాపిన్ని సీతారామశాస్ర్తీ 9440781236