Others

తెలుసుకుని తీరాలివి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జరిగిపోయిన తరువాత ఎన్ని చెప్పినా లాభం ఉండదు. నేటి మహిళలు అందరూ ఉన్నతశిఖరాలను అధిరోహిస్తున్నా ఇంకా ఎంత చదువుకున్నా అమాయకత్వాన్ని వీడని వారు మృగాళ్లకు బలవుతునే ఉన్నారు.
మృగాళ్లు అన్ని చోట్లా ఉంటున్నారు. వారు ఉండని ప్రదేశం అంటూలేనేలేదు. ఒక తండ్రి, ఒక సోదరుడు, ఒక ఉపాధ్యాయుడు, ఒక సహోద్యోగి, ఒక అపరిచితుడు, ఒక సహ ప్రయాణీకుడు ఇలా ఎవరైనా మృగాడు కావొచ్చు. మృగాడు కాదు అని చెప్పే వీలు లేనే లేకుండాపోతోంది. ఏ పరిస్థితుల్లో ఎవరు ఎందుకలా స్పందిస్తారో అమాయకులపైన వారి పంజా ఎందుకు విసురుతారో చెప్పలేము...
అందుకే ప్రతి ఆడపిల్లా ముందస్తు జాగ్రత్త తీసుకొని తీరాలి. దీనికి తల్లిదండ్రులే చొరవ చూపించాలి. బండి మీద వెళ్తున్నా, ఇద్దరితో కలసి వెళ్తున్నా, ఆఫీసుకానీ, పరిచితులతో కానీ ఎక్కడి వెళ్లినా అది ఏ సమయం సందర్భం అయినా సరే జాగ్రత్తలు తీసుకోవాలి.
టీవీల్లో ప్రతి పదిహేను నిముషాలకొకసారి యాడ్స్ వచ్చినట్లే మహిళా రక్షణ గురించి పోలీసులు తీసుకొంటున్న వివరాలను చూపించాలి. టిక్ టాక్ లాంటి యాప్స్‌లో పనికిమాలిన దృశ్యాలు చూపించి ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకోవడం లేదా సంసారాల్లో చిచ్చులు పెట్టుకునే చర్యలు కాక ఆడపిల్లలను ఎలా సంరక్షించుకోవాలి సమాజం లోని వారు ఎలా అప్రమత్తులై ఉండాలో చూపించాలి.
ప్రతి పౌరుడూ ప్రతి మహిళనూ సంరక్షించే దిశలోనే ఉండితీరాలి. అంతగా జనసంచారం లేని ప్రదేశాలు నగరంలో ఉన్నాయి అంటే అక్కడ తప్పనిసరిగా డే అండ్ నైట్ డ్యూటీలు వేసైనా సరే పోలీసులను అక్కడ నిరంతరం కాపుదలకు ఉంచాలి. తోల్‌గేట్స్ దగ్గర పోలీసు యంత్రాంగం ఉండే చర్యలను తీసుకోవాలి.
ప్రతి సంస్థలోను రాత్రిళ్లు ఒంటరిగా చాలా దూరం వెళ్లే మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేసే విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
100, 112, 181 వంటి నెంబర్లను టీవీల్లో అందరికీ తెలిసేవిధంగా రోడ్లపైన, టీవీల్లో స్క్రోలింగ్స్‌లోకూడా పెట్టాలి.
చిన్న పెద్దా అనే తేడాల్లేకుండా ప్రతి మహిళనోట్లో పోలీసు యంత్రాంగం, షీటీమ్స్ నెంబర్లు ఆడుతూ ఉండాలి.
ఇక పై ఎప్పుడూ ప్రియాంక రెడ్డిలాగా అనవసరంగా అసువులు కోల్పోయే స్థితి ఏ మహిళ తెచ్చుకోకూడదు. దానికోసం ప్రతి పౌరుడు, ప్రతి మహిళా తగిన చర్యలను తీసుకోవాలి.

- వాణిమూర్తి