AADIVAVRAM - Others

అయ్యో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోతకొచ్చిన పైరు
వర్షం ధారలో తడిసి ముద్దయినపుడు
రైతు కన్నీరు భూమిని
పవిత్రమో అపవిత్రమో చేస్తుంటే
ఏముంది భూమిలో!
రైతు కన్నీరు తప్ప
దేవుని కోపమా
ప్రకృతి శాపమా
తెలియదు
చెట్లు నరకటమా ఇసుక తోడటమా
భూమి పొరలు మదమెక్కిన
మనుష్యులతో
వేడివేడిగా మారి పొరలుగా మారటమా
సూర్యుని తాపమా
సాగర ఆగ్రహమా
మనిషి తప్పటడుగుల ఫలితమా
కాలం కాని కాలం
రైతు కుటుంబాల మీద
పిడుగులు రాలాయి
వర్షం వరద పిడుగులయినపుడు
ఆకాశంలో మెరిసిన మెరుపు
జీవితాన్ని కాల్చి బూడిద చేస్తున్నపుడు
తడిసిన పంట మృత్యు
దేవతగా మారితే..
అయ్యో!
రైతు రాజ్యం రావణ రాజ్యంగా మారింది.

సిహెచ్.మధు.. 949486122