Others

చిత్రాలు.. విచిత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీ విలన్ పాత్రలకు రమణారెడ్డి పెట్టింది పేరు. తన కెరీర్‌లో యెక్కువగా అలాంటి పాత్రలనే పోషించాడు. చెంచులక్ష్మి (1958)లో రేలంగి నారదుని వేషం వెయ్యగానే ‘పార్వతీ కల్యాణం’ (1958) చిత్ర దర్శకుడు భాస్కరరావుగారికి రమణారెడ్డి కూడా నారదుని వేషం వేస్తేయేం అన్న ఆలోచన వచ్చింది. బక్కచిక్కిన శరీరంతో రమణారెడ్డి దర్శనం యిస్తే హాస్యం సంగతి అలావుంచి జనం జడుసుకునే ప్రమాదం వుందని అందరూ సలహాయిచ్చారు. దర్శకుడు మాత్రం రమణారెడ్డి నారదుని వేషం వెయ్యాల్సిందేనని పట్టుబట్టి జుబ్బా తొడిగించి మేకప్ చేయించి చిత్రీకరించారు. అలా జుబ్బా ధరించిన నారదుణ్ని ఒక్క పార్వతీ కల్యాణం చిత్రంలో మాత్రమే మనం చూడగలం.
*యన్.టి.రామారావు నిర్మించిన ‘కోడలు దిద్దిన కాపురం’లో సత్యనారాయణ పాత్ర దొంగస్వాముల వారు- సెన్సార్ బోర్డు మెంబర్లు సినిమా చూస్తూ ఇంటర్వెల్లో బయటకు వచ్చి వారిలో ఒకరిద్దరు పిక్చర్ బ్యాన్ చెయ్యాలని అన్నారట. సమాజంలో సజీవుడైన ఒక వ్యక్తిని పోలిన పాత్ర సృష్టించి అపహాస్యం చెయ్యకూడదని, సత్యనారాయణ పాత్ర ఫలానా బాబాను పోలివున్నదని సెన్సార్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయం రచయిత డి.వి.నరసరాజుగారికి చెప్పటంతో ఆయన ‘పోలిక అంటే యేమిటో ముందు నిర్వచించండి. సెన్సార్ సభ్యులు చెప్పే బాబాగారికి మా సత్యనారాయణ పాత్ర దొంగస్వాముల వారికి పేరులో పోలిక లేదు. మా స్వాములవారి పేరు యే బాబాది కాదు. నిత్యానందస్వాములవారు డ్రెస్‌లో పోలిక లేదు. మా స్వాములవారిది పైజామా, షేర్వాణి, మనిషి ఒడ్డుపొడుగుతో పోలిక లేదు. మాట్లాడే భాషలో పోలిక లేదు. మాట తీరులో పోలిక లేదు. నడకలో పోలిక లేదు. ఉన్నదల్లా మీరు చెప్పే విగ్గులోనే పోలిక. అది యెప్పటినుంచో వస్తున్న సినిమా విగ్గు. బాలనాగమ్మ సినిమాలో మాయలమరాఠీ విగ్గు. ఎందరో విలన్లకు పెట్టే విగ్గు. అది యెవరి జుట్టునో పోలివున్నదని మమ్మల్ని మానేయమంటే యెలా? అని ప్రశ్నించారట. డి.వి.నరసరాజుగారి ఆర్గ్యుమెంట్స్ వ్రాసి బొంబాయి సెంట్రల్ సెన్సార్ బోర్డుకు పంపటంతో వారు ఆర్గ్యుమెంట్స్ సవ్యంగానే వున్నాయని యే కట్స్ లేకుండా క్లీన్ సర్ట్ఫికేట్ యివ్వటంతో ‘కోడలుదిద్దిన కాపురం’విడుదలైనది. పిక్చర్ టాక్ తెలుసుకోవటానికి డి.వి.నరసరాజుగారు యన్.టి.ఆర్ గారికి ఫోన్ చెయ్యగానే ఆయన ‘యు ఆర్ ది హీరో ఆఫ్ మై పిక్చర్’అని అన్నారట.
*‘రాముడు భీముడు’చిత్రంలో సి.నారాయణరెడ్డి ‘హొయలు తళుకుతళుకుమని’అనే పాటలో ‘రమ్మనకు పగలే నను రా రమ్మనకు’ అని వ్రాశారు. రికార్డింగ్ జరిగింది. కాని సెన్సార్ అధికారులు ఒప్పుకోలేదు. పగలే నను రమ్మనకు అంటే రాత్రి రమ్మనా? తొలగించండి అని అన్నారట. వారు చెప్పిన ప్రకారం ‘రమ్మనకు యిప్పుడే నను రమ్మనకు’ అని మార్చి వ్రాశారు సినారె. తిరిగి రికార్డింగ్ జరిగి సినిమాలో జోడించటం జరిగింది. సినిమాలో యిది వచ్చినప్పుడు లిప్ లింక్ కాదు. రికార్డులలో మాత్రం ‘పగలే నను రారమ్మనకు’ అని వుండిపోయింది.

-పూజారి నారాయణ