Others

రోజులు మారాయి (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1950కి పూర్వం విడుదలై అన్ని కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకొన్న సాంఘిక చిత్రం -రోజులు మారాయి. తాపీ చాణక్య దర్శకత్వంలో సారథి స్టూడియోస్ బ్యానర్‌పై విడుదలైన సినిమా. నాగేశ్వరరావు కథానాయకుడిగా, సియస్‌ఆర్ ప్రతినాయక పాత్రలు పోషించారు.
ఓ గ్రామానికి జమీందారు నాగరయ్య (సీఎస్‌ఆర్). రైతులకు అధిక వడ్డీకి అప్పులిచ్చి ఆస్తులు లాక్కునే రకం. దానికి కరణం సాంబయ్య (రమణారెడ్డి, పోలయ్య (రేలంగి) సహకరిస్తుంటారు. కోటయ్య (పెరుమాళ్లు) ఆ పల్లెలో నిజాయితీకల వ్యక్తి. భార్య (హేమలత), కొడుకు వేణు (అక్కినేని), కూతురు భారతి (అమ్మాజీ)లతో హాయిగా కలం వెళ్లదీస్తుంటాడు. జమీందారు సాగరయ్యను కోటయ్య గౌరవించినా, కొడుకు వేణు మాత్రం అతని దుర్మార్గాలను ఎదుర్కొంటుంటాడు. వేణు మిత్రుడు గోపాలం (వల్లం నరసింహారావు)తో భారత్ పెళ్లి నిశ్చయించి, కట్నం కోసం సాగరయ్య దగ్గర అప్పు చేస్తాడు కోటయ్య. అదే అవకాశంగా సాగరయ్య, కోటయ్య ఆస్తులు లాక్కోవాలనుకుంటాడు. ఊరి వెలికి గురైన రిటైర్డ్ జవాను రత్నం (సీతారాం) కూతురు రాధ (షావుకారు జానకి)ని ప్రేమించిన కారణంగా వేణు సైతం ఊరొదిలి వెళ్లాల్సి వస్తుంది. ఇన్ని ప్రతిబంధకాలను ఎదుర్కొని, ప్రతినాయకుల పనిబట్టి, ఊరిని ఎలా ఉద్దరించాడన్నది అసలు కథ. నాయకా ప్రతినాయకుల పోరాటంలో.. ఊరి పరిస్థితిపై కలెక్టరు విచారణకు వచ్చినపుడు సియస్‌ఆర్ -‘వీళ్లంతా తాడూ బొంగరం లేని గోచి పాతరాముళ్లు’ అంటూ విన్నపాన్ని పరిశీలించనవసరం లేదని చెప్పే డైలాగ్ ఒక్కటి చాలు.. సియస్సార్ నటన గురించి చెప్పడానికి. ఇక కథానాయకుడు నాగేశ్వరరావు కూలీల పక్షాన నిలబడి కలెక్టరుకు వాస్తవాలను వివరించి వాళ్లకు న్యాయం చేసే పాత్రను అద్భుతంగా పోషించారు. ఆనాటి హీరోయిజంలో పాత్రను అత్యద్భుతంగా పోషించి మెప్పించారు. విశేషమేమంటే అప్పుడే కొత్తగా సినీరంగానికి వస్తోన్న బాలీవుడ్ తార వహీదా రెహమాన్ తనకిచ్చిన పాత్రతో మెప్పించి, మంచి నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆమెపై చిత్రీకరించిన ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా/ నా కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా’ పాట పామరుల నోళ్లలో నానడమే కాదు, ఆ పాటలో ఆమె అభినయం చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేసింది.

-కె సుబ్రహ్మణ్యం, విశాఖపట్నం