Others

సిగ సింగారంపు సిరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీలాకాశం కన్నా భామ కురులే హాయి అనుకున్నరేమో సూర్య చంద్రులే దిగవచ్చి నడినెత్తికి కాస్త కింద జడపైన అందంగా కూర్చున్నారు. వీరి ప్రక్కనే చేరాయి. రాగిడీ కొమ్మలూ, ఆ రెండూ జంట కవుల్లాంటివి. ఒకటి ఉంటే మరొకటి ఉండాల్సిందేనట.
నడుముకు వడ్డాణం పెట్టుకుంటే ఉదర సంబంధ వ్యాదులు రావట. ముఖ్యంగా బాలింతలకు చాలా మంచిదట. ముక్కెర పెడితే సైనస్ వ్యాధులు తగ్గుతాయట.
ఇలా మగువలు ధరించే ప్రతి ఆభరణ వెనకా ఓ ఆరోగ్య రహస్యం ఉంటుందనే ఆభరణ శాస్త్ర చెబుతుంది. అందుకే కాబోలు ఆనాటి రాజులు, రాణులు శిరోవ్యాదులు రాకుండా ఉండేందుకు నెత్తిన కిరీటాలు, ఇతర ఆభరణాలు ధరించేవారు. నాటి ఆభరణాలు నేడు ఈ తరం ఫ్యాషన్‌గా మారిపోయాయి.
మన కవులు చెప్పే.. పదహారు సింగారాల్లో కేశాలంకరణల్లో జడ ముఖ్యమైనదే.
నాగరం, పాయ, ఈత పాయ వంటి జడలు తూర్పు పడమర కొప్పులూ ఇలా వీటిల్లో రకాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి అలంకారాలే అతివలకు అందాన్ని, ఆరోగ్యాన్ని ఇనుమడింపచేస్తాయి.
అతివల సింగారం కేశాభరణాలతోనే సంపూర్ణం. సిగ్గుపడుతూ నడిచేటపుడూ వయ్యారాన్ని ఒలికించే వాలుజడ.. కోపమొస్తే తాచుపాములా మెడను చుట్టే ఆ పొడుగు జడ .. అంతా జడ గొప్పతనమే! వేడుకలల్లో వాలుజడకు చివర బంగారు కుప్పెలూ, పైన పాపిట బిళ్ల, చెవుల మీదనుంచి చెంపల నుంచీ జుట్టులోకి వచ్చే మాటీలు, చెంపసరాలు చుట్ట పిన్నులూ, సూర్యవంక, చంద్రవంక.. రకరకాల వరుసల్లో పూలు, ఇవన్నీ జడ అందాన్ని పెంచేవే.
బంగారంలో పొదిగిన కెంపులు, పచ్చలు, వజ్రాలు .. వంటి విలువైన రత్నాలతో కూర్చిన నాగరం జడపైన లేదా చుట్ట పైన ఉందంటే ఆ జడగలిగిన భామ సింగారం ఎంతటిదో వర్ణించడానికి కవులు కలం పట్టాల్సిందే. ఇప్పుడైతే బంగారం స్థానంలో వెండి, రాగి, ఇత్తడి, ఆఖరికి ఫ్యాస్టిక్ పూసలు, ఎండి పోయిన పూలు, కొమ్మలు, పూసలు ఇలా ఎన్నింటినో ఉపయోగిస్తూ సిగ సింగారాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తున్నారు.
ఇపుడిప్పుడు వయస్సు తేడాల్లేకుండా లూజ్ హెయర్ అంటూ జడను అల్లకుండా జుట్టును వదిలేస్తున్నారు. కానీ ఆ జుట్టును వదిలేయడంలోను కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. ముందు కొద్దిగా దువ్వి అక్కడ అంతాపిన్నులు, అనేక రకాల ఆభరణాలు పెడుతూ ఆకర్షణీయంగా తయారు అవుతున్నారు. బాబ్డ్ హెయిర్లకి పోనీటెయిళ్లకీ, పొట్టి జళ్లకూ బోలెడు యాక్ససరీలు.. హెయిర్ పిన్నులు , క్లిప్పులు, జడబిళ్లలు. . వంటివన్నీ వస్తున్నాయి. ఇలా సిగలో అలంకరించుకునే ఆభరణాలెన్నో... సో కొనాలే కానీ మనసు మెచ్చిన మగువల కోసం నగరీకుల ముంగిట బోలెడు కేశాభరణాలు. ఎన్నో ఎనె్ననో...

- తులసి జ్యోతి