Others

అద్భుత వరం.. భద్రపరుచుకోండిలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమే! తల్లికావడం ఎంత ఆనంద అద్భుతవరమో తల్లిదండ్రులకు చెప్పనవసరం లేదు. ఇంతకుముందుకాలంలో తల్లి ఆసుపత్రిలోనో, ఇంట్లోనో ఉంటే బయట తండ్రి, ఆయనతోపాటు మిగతా కుటుంబ సభ్యులు చాలా ఆందోళనతో ఆత్రుతతో ఎదురుచూసేవారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆధునిక వసతులు వచ్చాయి.
అందుకే
బిడ్డ పుట్టటం ఎంత అద్భుతమో అంత పదిలం చేసుకోవచ్చునన్న వెసలుబాటును కార్పోరేటు ఆసుపత్రులు కల్గిస్తున్నాయి.
తల్లిదండ్రులు కావాలని భార్యాభర్తలు అనుకొన్న క్షణం నుంచి ఫ్యామిలీ కౌన్సిలింగ్‌లు, పేరెంట్ థెరిపీ, జన్యుకౌన్సిలింగులు ఇలా ఎన్నో సదుపాయాలు తల్లులు అయ్యేవారికి దగ్గరగా వచ్చాయి. అందులోను మొట్టమొదటిసారిగా తల్లిగా మారే మహిళకు ఎన్నో వసతులు కల్పించడంతోపాటుగా కడుపులో బిడ్డ ఎదిగే సమయం , ఆ అనుభూతి, బిడ్డ పుట్టిన క్షణం అపుడు కలిగిన భావోద్వేగం తండ్రి కళ్లల్లో కనిపించే ఆనందానుభూతి తల్లి తన బిడ్డను స్పృశిస్తూ ఆస్వాదించే మధుర క్షణమూ ఇవన్నీ పదిలంగా దాచుకొనే వీలును కొన్ని ఆసుపత్రులు కల్గిస్తున్నాయి. ప్రత్యేక సూట్ స్టార్ హోటళ్ల వంటి గదులనుప్రత్యేకంగా ఏర్పాటు చేసి గర్భిణి స్ర్తి మనస్సు ఆహ్లాదకరంగా ఉండడానికి ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర విభాగం కూడా దీనికి దగ్గరలోనే ఉంటుంది. ప్రత్యేక బాత్‌రూమ్స్, ప్రత్యేక
ఈ గర్భిణి స్ర్తికి మాత్రమే కాదు పక్కనే వారి కుటుంబ సభ్యులుండడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. కొత్త పాపాయిని చూడడానికి వచ్చే బంధువులకు కావాల్సిన వసతులను కూడా ఈ ఆసుపత్రులు కల్గిస్తున్నాయి. అందుకే బిడ్డ పుట్టిన క్షణం కాదు కాదు బిడ్డ కడుపులో కదిలిన క్షణం నుంచి మధుర ఘట్టాలను పదిలం చేసుకొనే వీలు ఉంటోంది. కనుక కాబోయే తల్లిదండ్రులూ మీ బిడ్డల అపురూప సన్నివేశాలను మధురంగా మార్చుకోండి.
రెండోసారి గర్భధారణ చేస్తున్న స్ర్తిలకు అంతకుముందు పుట్టిన బిడ్డలు కొత్తగా రాబోయే శిశువును ఎలా చూడాలి. ఏవిధంగా వ్యవహరించాలి అన్న విషయాలనుకూడా ఈ జన్యు కౌన్సిలింగ్‌వారు వివరిస్తారు. తల్లి ఏవిధంగా బిడ్డను పెంచాలి. పాలు ఏవిధంగా ఇవ్వాలి. ఏ సమయంలో ఎట్టి ఆహారం ఇవ్వాలి. ఎలాంటి దుస్తులు వేయాలి. ఎలాంటి వాతావరణంలో చిన్ని పాపాయి చిరునవ్వులు చిందిస్తుంది ఇలాంటి వన్నీ కూడా ఈ కౌన్సిలింగ్ చేసేవాళ్లు చెప్తారు.

- రాజమల్లమ్మ