Others

మహానగర సందర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరం నాలో నిద్ర పోతుందేమో బహుశా
నేను నిద్ర మేల్కొనగానే నాతోపాటు మేల్కొంటుంది
నగరం నాలో పరుగుపెడుతుందేమో బహుశా
నేను ఆఫీసుకు వెళ్లేప్పుడు నాతోపాటు
పరుగు పెడుతుంది
నగరం నాలో తన శతసహస్ర బాహువుల్ని దాచిపెట్టిందేమో బహుశా
నేను పనిచేసేప్పుడు నాతోపాటు పనిచేస్తుంది
ఇప్పుడు నగరంలో నేనున్నానా?
నాలో నగరముందా?
చర్చించాల్సిన విషయమే కాదు -
నగరం నేనూ ఒక్కటైపోయ చాలాకాలమైంది
నగరంలో బాంబు పేలితే నా గుండె చచ్చిపోతుంది
నగరంలో ఏ మూల విధ్వంసమైనా,
నాలో ఒక మూల ధ్వంసవౌతుంది
ఉద్యమాలు, బలిదానాలు,
బాష్పవాయువులు, తూటాలు
నా జీవితపు ఎల్‌సీడీపై 24 బై 7 ప్రత్యక్ష ప్రసారాలే
మానభంగాలు, హత్యలు, నక్సలైట్ల లొంగుబాటు
నిద్రపోతున్న ప్రభుత్వపు గుర్రు
అన్నీ ఈ బతుకు దినపత్రికమీద
ప్రధాన వార్తా కథనాలే
నిద్రపోతున్నా నిద్రపోతున్నట్టు లేదు
మేల్కొని ఉన్నా స్పృహలో ఉన్నట్టు లేదు
నగరాన్ని తాగి, నగరాన్ని తిని,
నగరాన్ని జీర్ణించుకుని
నగరానికీ నాకూ తేడాయే లేనట్లు
ప్రతి ఫ్లైఓవర్ వంగిన నా వెన్నుపూస అయనట్లు
ఎండిన ప్రతి జలాశయమూ ఇంకిపోతున్న
నా కన్నీటి కడలి అయనట్లు
కంకర తేలిన ప్రతి రోడ్డూ కాలుష్యంతో
పెచ్చలు పెచ్చలుగా పగిలిన నా చర్మమైనట్టు
జీవ సంబంధాలు, జీవన సంబంధాలు
మైత్రీ సంబంధాలు చిన్నాభిన్నం చేసుకుని
ఎంత సెల్‌ఫోన్ టవర్‌లా నిటారుగా
నిలబడితే మాత్రం ఫలితమేమిటీ?
ఇంట్లో, వీధిలో దూరాలు పెంచుకుని
కొత్త గ్రహాలతో సంబంధాలు పెంచుకుంటే ఫలితమేమిటీ?
మోసం, దగా, లంచగొండితనపు వ్యాధులతో
నగరం రోగగ్రస్థమై పోతే
నీతి, నిజాయతీల స్వచ్ఛమైన గాలీ
ఆరోగ్యం నాకెక్కడ దొరుకుతాయ్?
కార్బన్ మోనాక్సైడ్‌లో నగరమే కనిపించకుండా ఉంటే
ఇక నగరంలో నేనెక్కడ కనిపించాలి?
ఇప్పుడు గూగుల్ సర్చ్‌లో నన్ను నేను వెతుక్కోవాలంటే
నేనుండే నగరాన్ని గుర్తుంచుకోవాలి
నన్ను నేను తెలుసుకోవాలంటే
నేనుండే నగరం గూర్చి తెలుసుకోవాలి!
నా నగరం గూర్చి తెలుసుకోవాలంటే
ముందు, నాలోని ఒక మహానగరాన్ని దర్శించుకోవాలి!!

- డా. దేవరాజు మహారాజు, 9908633949