Others

దంతాల రంగు మార్చుకోండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముప్పై దాటుతున్నాయంటే శరీరంలో కొద్దికొద్దిగా మార్పులు వస్తుంటాయి. అపుడు పట్టించుకోకపోయినా నలబై లోకి అడుగుపెట్టే అతివలంతా తమ ముఖ సౌందర్యంలో వచ్చే మార్పులను అడ్డుకోవడానికి నానా విధాల కష్టాలను పడుతుంటారు.
వాటిల్లో దంత సమస్యలొకటి. కొన్ని అలవాట్లు, కాఫీలు, టీలు ఎక్కువగా తాగడం కూడా దంతాల రంగు మారే అవకాశాలు ఉంటాయి. మరికొన్ని అనివార్యంగా వచ్చే వ్యాధులు ఇలా ఏవైనా దంతాల సమ్యలకు కారణాలు అవుతున్నాయి. కొందరి పళ్లు ఊడిపోవడం, మరికొందరికి పళ్లు రంగుమారడం వంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ రంగు మారిన పళ్లతో నవ్వడానికి, ఎవరితోనైనా ఆనందంతో మాట్లాడడానికి మహిళలు ఇబ్బంది పడుతుంటారు.
ఇటువంటివారికి దంతవైద్యులు మీ దంతాలు ఊడిపోయినా, రంగు మారినా సమస్యగా భావించకండి. మీ దగ్గరకు రండి. మీ దంతసౌంరర్యాన్ని మేము ఇనుమడింపచేస్తాం అంటున్నారు.
సాధారణంగా డెంటల్ స్కేలింగ్ అనే పద్ధతి వల్ల రంగుమారిన పళ్లను తిరిగి పూర్వరూపంలోకి తీసుకొని వస్తుంటారు వైద్యులు. కానీ ఇది పాచి పట్టటం లేదా తాంబూలాలు ఎక్కువగా వేసుకోవడం తర్వాత శుభ్రపరచకపోవడం వంటి వాటి వల్ల రంగు మారిన దంతాలను తిరిగి తెల్లగా తీసుకొని రావచ్చు.
కొన్నిసార్లు కొందరి దంతాలల్లో వచ్చిన రంగు మార్పు దీనివల్ల తెల్లగా రాకపోవచ్చు. అటువంటి వారికి 3సెరమిక్ లామినేట్స్2 అనే పద్ధతి వల్ల పంటిపైన ఏర్పడిన ఫ్లోరైడ్‌లేదా టెట్రాసైక్లిన్ వల్ల ఏర్పడిన మచ్చలను కూడా దూరం చేసుకోవచ్చునని వైద్యులుచెబుతున్నారు.
మరికొందరిలో దంతాలు పసుపుపచ్చగా కనిపిస్తుంటాయి. ఇటువంటి వారు తమ దంతాలు తెల్లగా ఉండాలనుకొంటే క్లీనింగ్ అనే అత్యాధునిక ప్రక్రియతో దంతాల రంగును మార్చుకోవచ్చు. ఇందులో కూడా లేజర్ బ్లీచింగ్ వంటి పద్ధతులను ఉపయోగించి దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. చిన్నప్పుడు అనారోగ్యం వల్ల ఎక్కువ మందులు వేసుకోవడం లేదా ఫ్లోరైడ్ నీళ్లు తాగడం వంటివి చేయడం వల్ల కూడా రంగు మారిన పళ్లను తిరిగి తెల్లగా మార్చుకోవచ్చు అని దంతవైద్యులు సలహా ఇస్తున్నారు కనుక ఎవరైనా నిరభ్యంతరంగా దంత వైద్యుల దగ్గరకు వెళ్లి మీ పంటి సమస్యలను చెప్పి, దంత సౌందర్యాన్ని పెంచుకోండి.

- వాణి మూర్తి