AADIVAVRAM - Others

నాన్నకు నాన్నై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పగిలిన కాళ్లు ప్రశ్నిస్తున్నాయి
అదేమంటే శీతాకాలం కదా అందుకే
పగిలాయని నాన్న జవాబు!

చీలిన పెదాలు హెచ్చరిస్తున్నాయి
ఎండన తిరిగి వేడిచేసి చీలాయి లేరా అని నాన్న జవాబు!

చిరిగిన చొక్కా పేదరికాన్ని చూపెడుతున్నది...
ఈ వయస్సులో ననె్నవరు మెచ్చుకోవాలి లేరా అని
నాన్న జవాబు!

అలసిన మొహం కష్టాన్ని గుర్తిస్తున్నది...
ఎండ తాకిడికి మొఖం వాడిందిరా
ఎక్కువ పనేమీ చేయలేదని నాన్న జవాబు!

స్వేదం బొట్లు బొట్లుగా కరుణగా జారుతున్నది...
ఉక్కపోతకు అలా వస్తుంది లేరా అని నాన్న జవాబు!

తెగిన చెప్పులు ఆర్థిక ఇబ్బందిని చూపెడుతున్నది..
వేసుకోవటానికి ఇవే మెత్తగా ఉంటాయని నాన్న జవాబు!

కూడు లేక దేహం బక్కచిక్కి శల్యమై పోయింది...
లావుగా ఉంటే పనీపాటా చేయలేమని ఇలా వున్నానని నాన్న జవాబు!

ప్రశ్నలన్నీ నేను సంధించినవే తెలిసీ తెలియని
అమాయక సందిగ్ధ వయసులో
జవాబులన్నీ నాన్న నుండి వచ్చినవే
జీవితాన్ని కాచి వడబోసిన వయసులో!

వయసు పెరిగాక మనసు పరిణితి చెందాక
నాన్న చెప్పే జవాబులన్నీ అబద్ధాలని గ్రహించి
నాన్నను నిలదీసి అడుగుదామనుకొనేంతలో
ఏదో పనున్నట్లు
సరైన జవాబులివ్వకుండానే
హడావిడిగా వెళ్లిపోయాడు నాన్న
తిరిగి మరలిరాని లోకం నుండి
వచ్చిన పిలుపునకు జవాబివ్వటానికి!
జవాబు రాని ప్రశ్నలతో నన్నిక్కడే
ఈ లోకాన ఒంటరిగా వదిలేసి!

దేముడా! నాకు మరో జన్మంటూ ఉంటే
ఈ నాన్నకే కొడుకుగా పుట్టించు
తాను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా
ముఖం మీద కనపడనీయకుండా
నన్ను సుఖ తీరాలకు చేర్చిన నాన్న నుండి
నా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలి!

అంతగా ప్రేమించిన నన్ను ఏకాకిగా
వదిలేసి ఎలా వెళ్లిపోయావని
ఆఖరి ప్రశ్న కూడా సంధించాలి!!
*

- శివేగారి చిన్ని కృష్ణ 63003 18230