Others

తెలుగు సినిమా వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*నటి సావిత్రి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం -చిన్నారి పాపలు (1968). కేవలం నటనలోనే కాదు దర్శకత్వం వహించడంలోనూ తన ప్రజ్ఞాపాటవాన్ని సావిత్రి నిరూపించుకుంది. ఇతర సాంకేతిక శాఖల్నీ మహిళలే నిర్వహించడం విశేషం. కథను దర్శకులు వి మధుసూదనరావు సతీమణి వి సరోజిని వ్రాయగా సావిత్రి స్క్రీన్‌ప్లే సిద్ధం చేసింది. ప్లేబ్యాక్ గాయని పి లీల సంగీతం నిర్వహించగా, నటి రాజసులోచన నృత్య దర్శకత్వాన్ని చేపట్టింది. జమున, జగ్గయ్య, యస్‌వి రంగారావు, రేలంగి, పద్మనాభం, రమణారెడ్డి ప్రధాన పాత్రలు ధరించారు. మాతా ప్రొడక్షన్స్ బ్యానర్ క్రింద తయారైన ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రజిత పతకం లభించింది.

*అనేక కన్నడ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన సత్యం మొట్టమొదటిసారిగా తెలుగులో సంగీతాన్నందించిన చిత్రం ‘-పాలమనసులు (1968). కన్నడ చిత్రం ‘బెల్లిమోడ’ ఆధారంగా దీన్ని నిర్మించారు. కన్నడంలో శర్వాణి వ్రాసిన ‘బెల్లిమోడ’ నవల ఆధారంగా త్రివేణి రాసిన ‘వెండిమబ్బు’ నవల దీని ఇతివృత్తం. చిత్రం ముగింపు మామూలుకు భిన్నంగా వుండి ప్రేక్షకులను ఆశ్చర్యపరచింది. జమున, హరనాథ్ హీరో హీరోయిన్లు.

*పల్లెపడుచు, అన్నాచెల్లెలు, కులంలేని పిల్ల వంటి నాటకాలు రచించి, రచయితగా ‘రాజు- పేద’ (1954) ద్వారా చిత్రరంగం ప్రవేశించి, ‘ఇలవేల్పు’ (1956)తో ఇండస్ట్రీలో స్థిరపడ్డ పినిశెట్టి శ్రీరామ్మూర్తి (దర్శకులు రవిరాజా పినిశెట్టి తండ్రిగారు) సొంత బ్యానర్ రౌతు పిక్చర్స్ స్థాపించి దర్శకత్వం వహించిన చిత్రం ‘నిత్యకల్యాణం పచ్చతోరణం’ (1960). కులం కంటే గుణం ప్రధానమని చెప్పిన రుూ సందేశాత్మక చిత్రంలో హీరో చలం. ఆయన సరసన కృష్ణకుమారి నటించింది. సంగీత దర్శకుడు పెండ్యాల. పిబి శ్రీనివాస్, సుశీల పాడిన మరపురాని డ్యూయెట్ ‘నీ మది పాడెను యేమని’ రుూ చిత్రంలోనిదే. ఈ చిత్రం ఆధారంగా యల్‌వి ప్రసాద్ హిందీలో ‘దాదిమా’ నిర్మించి విజయం సాధించారు. తమిళ వెర్షన్ ‘తాయిల్లాపిళ్లై’.

*కవి, పండితుడు, పాత్రికేయుడు, నటుడు, కళావాచస్పతి కొంగర జగ్గయ్య స్వయంగా నిర్మించిన చిత్రం -పదండి ముందుకు’ (1962). ఈ చిత్రానికి జగ్గయ్య సంభాషణలు వ్రాయడమే కాకుండా ‘లోకం చీకటిలో’ అనే పాటనూ రాశారు. భారతదేశ స్వాతంత్య్ర సమరం బ్యాక్‌గ్రౌండ్‌గా తీసిన ఈ చిత్రంలో స్వాతంత్య్ర పోరాటాలను స్ఫుటంగా చూపెట్టినప్పటికీ ‘హ్యూమన్ డ్రామా’కే ఎక్కువ ప్రాధాన్యత యిచ్చారనే విమర్శ అప్పట్లో వినబడింది. మహమ్మద్ రఫీ ప్లేబ్యాక్ పాడిన మొట్టమొదటి చిత్రమిది. శ్రీశ్రీ వ్రాసిన ‘పదండి ముందుకు పదండి ముందుకు’ గీతాన్ని రసవత్తరంగా చిత్రీకరించిన రుూ చిత్రానికి దర్శకుడు వి మధుసూదనరావు, హీరోయిన్ జమున.

-పూజారి నారాయణ, అనంతపురం