Others

విచిత్ర కుటుంబం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1969లో విడుదలైన ‘విచిత్ర కుటుంబం’ నాకు నచ్చిన సినిమా. ఈ చిత్రాన్ని నిర్మాత వికెపి సుంకువల్లి (సుంకువల్లి) శ్రీ రాజ్ ఆర్ట్ ఫిలింస్ పతాకంపై నిర్మించారు. పూర్తి వినోదంతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రమిది. యన్టీ రామారావు, కృష్ణ అన్నదమ్ములుగా, సంధ్యారాణి చెల్లిగా, సావిత్రి, విజయనిర్మలలు యన్టీఆర్, కృష్ణలకు భార్యలుగా నటించారు.
యన్టీఆర్ లాయర్ రాజశేఖరంగా ప్రముఖమైన వ్యక్తి. భార్య సావిత్రి భయస్తురాలు, పిరికి స్వభావం. తమ్ముడు కృష్ణ దుందుడుకు స్వభావం కోపిష్టి. ఎవరైనా విమర్శిస్తే కోపంలో వెనకాముందు చూడకుండా కొట్టేస్తాడు. వాళ్లు ఇంటి మీదకొస్తే మరిదిపై పుత్రవాత్సల్యంతో భర్తకు తెలియకుండా డబ్బులిచ్చి బతిమలాడి వాళ్ళను సద్దుమణిగిస్తుంది. ఈమె చెల్లెలు విజయనిర్మల కూడ కృష్ణలాంటిదే. ఇద్దరూ ప్రేమించుకుంటారు. విలన్ నాగభూషణం వీరికి కుటుంబ స్నేహితుడు, దుర్మార్గుడు. ఆస్తికోసం రష్యాలో చదువు ముగించుకొని, అక్కడి అమ్మాయిని పెళ్ళాడి వచ్చిన ఆ జంటను వారి బోటుషికారులో అంతమొందిస్తాడు. సావిత్రి తండ్రికి ఎప్పుడో బాకీ వున్న నాగభూషణాన్ని ఎప్పుడూ అడుగుతుండే ఆమె, నాగభూషణం ఎవర్నో హత్యచేయటాన్ని కళ్లారా చూచిన ఆమె బాగా భయపడిపోతుండటం గమనించిన భర్త. తర్వాత ఈ కుట్రను కోర్టులో వాదనలతో పరిష్కారంతో చిత్రం సుఖాంతమవుతుంది.
నడివయసు పాత్రలో యన్టీఆర్, భయపడే సావిత్రిని ఇప్పటిమాదిరి ‘పంచ్’ డైలాగ్స్‌తో వినోదాన్ని కలిగించే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. యువకునిగా కృష్ణ నటన, చురుకుతనంతో దుందుడుకు స్వభావిగా ఆకట్టుకొని, విజయనిర్మలతో ప్రేమ సన్నివేశాలలో, ఫైటింగ్స్‌లో బాగా నటించారు. రాజబాబు కామెడీ గురించి చెప్పేదానికన్నా చూస్తే బాగుంటుంది. టి.వి.రాజు సంగీత దర్శకత్వం పాటలన్నీ సూపర్ హిట్సే. శోభన్‌బాబు, షీలాలపై వచ్చే పాట ‘‘ఆడవే జలకమ్ము లాడవే’’ ఘంటసాల సుశీల పాడిన ఈ పాట చిత్రంలో హైలెట్! చిత్రంలో ఎన్.టి.ఆర్‌కు పాటలు ఏమిలేకపోవడం విశేషమైతే, కృష్ణ, విజయనిర్మలపై పాటలుండటం. పాటలన్నీ సూపర్‌హిట్ సాంగ్స్. ఈ సినిమా కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మాణమై విజయవంతమైంది. చూస్తున్నంతసేపు విసుగులేకుండా హుషారుగా ఉంటుంది.
-పీవీఎస్పీ, అద్దంకి