Others

‘మోగునా ఈ వీణ.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మోగునా ఈ వీణ మూగ వోయిన రాగహీన అనురాగహీన’ ఇదీ పల్లవి పాటకు. పాట ‘మురళీకృష్ణ’ చిత్రంలోది. చిత్ర దర్శకుడు దర్శక పితామహ పి పుల్లయ్య. గీత రచయిత ఆచార్య ఆత్రేయ. సంగీత సంధానకర్త మాస్టర్ వేణు. సంగీతానికే మాస్టర్‌లాంటి వాడు కనుక ‘మాస్టర్’ ఇంటిపేరుగా స్థిరపడింది. పేరేకాదు ఆయన స్వరపరచిన సంగీతపు తీరూ అంతే మరి. మోగునా ఈ వీణ మూగవోయిన రాగహీన అనురాగహీన (పల్లవిలోనే నిరాశ...నిస్పృహ...) పాటలెన్నో నేర్చినది... ప్రభువురాకకై వేచినది/ ప్రభువు విని మెచ్చకనే వెడలిపోయెను... బ్రతుకే వెలితి చేసెను/ ఆదిలోనే అపశృతి పలికెను... నాదమంతా ఖేదమాయెను/ స్వరములు ఏడు సముద్రాలై ముంచివేసెను...తంత్రులు త్రెంచి వేసెను/ దేవుడు లేని కోవెలగా జీవితమంతా శిథిలము కాగా/ప్రభువు వెళ్ళిన అడుగుజాడలే వెతుకుతుంటిని శూన్యంలో. శూన్యమైన జీవితం రాగహీనం... అనురాగ హీనం. చివరాకరి పదం ‘శూన్యం’ ఈ ఒక్క మాట చాలు విషాదానికి చరమాంకం. ఏ రసాన్ని పలికించటంలోనైనా అందెవేసిన కలం ఆత్రేయది... అందునా విషాదం వర్షించటంలో సిద్ధహస్తుడు, చెయి తిరిగిన కలం...దానికితోడైతే స్వర కోయిల... స్వరాల ఊయల శ్రీమతి ఎస్.జానకి... ఇక మాస్టర్ వేణు సంగీతానికి పంట పండినట్లే... ఆ గాయనీమణి పాడినట్లే.
అందుకే ఆచార్య ఆత్రేయ వ్రాయక నిర్మాతలని... వ్రాసి ప్రేక్షకుల్ని కంట తడిపెట్టిస్తాడన్న మాట అక్షర సత్యం అనిపించక మానదు ఈ పాటను వింటే. తెరపై అభినయించే కథానాయికలు శ్రీమతి జమున, గీతాంజలి అభినయంలో సగం మార్కులు పాటవల్ల స్కోర్ చేసినట్లే... ఇంకో సగం దర్శక స్రష్ఠ శ్రీ పి.పుల్లయ్య వారినుండి రాబట్టినట్లే అగుపించింది చిత్రంలో. ఆయన పేర్చుకున్న పదాలన్నీ విషాద గుళికలైతే... పేర్చిన తీరు(ప్రయోగం) బహుధా ప్రశంసనీయం. వీణను శృతిగా మీటేటట్లు పాట వ్రాయగలడు... నాధం కేదమయ్యేలాగు వ్రాయగలడు. ఆ పదాల పదునుకు అదును ఏర్పడుతుంది స్వరాలకు, గాయనీ గాయకులకు.
ఈ పాట నాకెంతో ఇష్టం .
-ఆచార్య క్రిష్ణోదయ, సికింద్రాబాద్