Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. విద్య నేర్వంగ సరిపోదు వెలుగులీను
మేటి సంస్కార వంతులై మెలగవలయు
నదియు లేనట్టినరులు హీనతనుఁ గాంచుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: చదువుకున్నామంటే చదువుకున్నామని కాదుకదా. ప్రకాశవంతమైన గొప్ప సంస్కారవంతులై చక్కగా నడచుకోవాలి. ఆ సంస్కారంలేని మనుషులు హీనస్థితికి చేరుకుంటూ చెడ్డవారిగా మిగిలిపోతారు. అందుకే చదువుకాదు ముఖ్యం సంస్కారమని ఈలోకానికి ప్రబోధించవయ్యా సూర్యదేవా!
తే.గీ. రేకులనుఁ బోలునట్టి హెల్మెట్ల వేల?
లాంఛనప్రాయమునకనా? రమ్యమైన
జీవితాలతో ఁ జెలగాటమాడనేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ద్విచక్రవాహన చోదకులు రక్షణార్థం తలపై హెల్మట్లుధరించాల్సి ఉంది. కానీ ఏదో మొక్కుబడిగా పలచటి రేకులను పోలే హెల్మెట్లు నామ్‌కే వాస్తే ధరిస్తున్నారు. అందమైన తమ తమ జీవితాలతో చెలగాటం ఆడరాదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించవయ్యాస్వామి!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262