Others

అంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మట్టిగోడల ఇళ్ళు
కూటికుండ తిళ్ళు
నులక మంచాల పవ్వళ్ళు
ఆటల సంద్రంలో ఈదిన
ఆహ్లాదాల సాయంత్రపు పడవలు
బాధ్యతగా భుజాలకెత్తుకున్న
అనుబంధాల కాశీ కావిళ్లు
లోటన్నది తెలియక గడిచిన
ఘనమైన రోజులు
జోరు వర్షంలో
మంజురు మీదుగా రాలుతున్న
ముత్యపు చినుకుల్ని
అరచేతుల్లోంచి తుళ్లించే
అమాయకపు నవ్వులు
కలల పండగల్ని ఆహ్వానించి
నీలి ఆకాశంలో
నిండు గాలిపటాలై ఎగిరిన
నిత్య యవ్వనాలు

వణికించే చలి పురుగును
మంటల్లో తగలబెట్టిన ఆరుబయళ్లు
నట్టింట్లో మాటలు పోగేసి
ఏ జాముకో నిద్ర పాటందుకునే
వెలితి లేని రాత్రులు
కోడి కూతలతో పోటీపడుతూ
వేకువకు ముందే
ఊరిని మేల్కొలిపే పుస్తక పఠనాలు

విధి వంచనలో ఓడలు బళ్ళై
వెనె్నముక విరిగి నడివీధిలో
ఆకలి ఆర్తనాదమై కూలినపుడు
ప్రేమగా భుజం తట్టి
పట్టెడు మెతుకులు పెట్టి
హృదయానికి పొదువుకున్న
పచ్చని పంట పొలాలు

చరిత్రకు వేలాడుతున్న
చివరి ఆనవాళ్ళు
గతించిన కాలం మిగిల్చిన
ఆఖరి పరిమళాలు.

ఇప్పుడంతా కుళ్లు
కనీవినీ ఎరుగని కుట్రలు
కుటిల రాజకీయాలు
ఊడలతో విశాలమవుతున్న
వటవృక్షపు నీడలోనూ
సేద తీరలేని సంకుచిత అంతరంగాలు

తియ్యని పిలుపుల
అవసరాల శకం దాటిపోయాక
పరిచయాల పాలపుంత
చిరునవ్వుతో ఎదురైనా
పలకరింపుగానైనా స్పృశించని
చిమ్మచీకటి బ్రతుకులు.

- చొక్కాపు లక్ష్మునాయుడు 9573250528