Others

ఆదిశంకరుల వివేక చూడామణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివేక చూడామణి (తెలుగు)
మూలం: ఆదిశంకరులు
అనువాదం: శ్యామశాస్ర్తీ
వెల: 300 - పుటలు: 500
ప్రతులకు
యుగాది పబ్లికేషన్స్
304, శ్రీ దుర్గా రాజీవ్ రెసిడెన్సీ
విజయపురి, తార్నాక
హైదరాబాద్ - 500 017
*
భళ్లముడి శ్యామసుందరరావు లోగడ ఆలిండియా రేడియోలో ఉద్యోగించి అనంతర కాలంలో ఆధ్యాత్మిక గ్రంథ రచనకుపక్రమించారు. ఆ పరంపరలో శ్యామశాస్ర్తీ అనే పేరుతో బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం వ్రాశారు. వివేక చూడామణిని మూలంతో అర్థతాత్పర్యాలతో సరళంగా తెలుగు లిపిలో తెలుగువారి సౌకర్యం కోసం ఇప్పుడు గ్రంథంగా తీసుకొని వచ్చారు. ఈ ప్రయత్నంలో కుప్పా శ్రీనివాసశాస్ర్తీగారి యుగాది పబ్లికేషన్స్ వారికి ప్రోత్సాహాన్ని అందించింది. శ్యామశాస్ర్తీ గారిది పండితవంశం. వీరి తండ్రిగారు శిరోమణి సీతారామశాస్ర్తీగారు సంస్కృతాంధ్రములలో నిష్ణాతుడైన విద్వాంసుడు. శ్యామశాస్ర్తీగారు ఉద్యోగ విరమణ తర్వాత సంస్కృతం అభ్యసించి కాశిలోను గోకర్ణాలలోను కొంతకాలం తపస్సు చేసి ఆ తర్వాత స్వాధ్యాయంతో అనేక గ్రంథాలలోని మెళకువలు గ్రహించారు. వివేక చూడామణిపై లోగడ కొందరు వ్యాఖ్యానం వ్రాసిన మాట నిజమే. కాని శ్యామశాస్ర్తీగారు ఒకవైపు మూలాన్ని మరొకవైపు ప్రతిపదార్థాలను ఇస్తూ తెలుగులో అందించటం చాలా సౌకర్యమైన ప్రక్రియ. సంస్కృత లిపి శీఘ్రంగా చదువుకోలేని తెలుగువారికి ఈ తెలుగు గ్రంథం కరదీపిక వలె ఉపయోగపడుతుంది. వివేక చూడామణిలో ఆత్మ, అనాత్మల విచారం, సృష్టి స్థితి లయ వివేకం, అధ్యారోపం జీవ బ్రహ్మైక తత్వం వంటి గహనమైన ఎన్నో విషయాలు చర్చింపబడ్డాయి. దేహము వేరు ఆత్మ వేరు అని వేదాంతం చెపుతున్నది. బృహదారణ్యకోపనిషత్తులో జాగ్రత్- స్వప్న- సుషుప్తులలో జీవుడు పొందిన అనుభూతులేమిటి? నిద్రిస్తున్నప్పుడు జీవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రత్యగాత్మ ఎవరిలో లీనమై ఉంది? ఇలాంటి విషయాలను దీర్ఘంగా చర్చించటం జరిగింది. సూర్య కిరణములతో చీకటి పటాపంచలైనట్టు సచ్చిదానంద జ్ఞానముతో ఐహిక దుఃఖములు తిరోగమనం చెందుతాయి (పుట-287). ‘పరమాత్మ తత్వజ్ఞానము లభించిన పిదప మిధ్యారూపమైన ప్రపంచము లేనే లేదు. సత్యరూపము నిర్వికల్పమైన బ్రహ్మమునందు ప్రపంచమునకు అస్తిత్వము లేదు. తాడు త్రికాలములలోను సర్పము కానేరదు. ఎండు బావిలో బొట్టు నీరు కూడా లభ్యం కావడం అసంభవం. అట్లే యదార్థ జ్ఞానము పొందిన తర్వాత అపోహలకు తావులేదు’ (పుట-365). లోగడ శృంగేరీ పీఠాధిపతులు 582 శ్లోకములలో 516 శ్లోకములు సవ్యాఖ్యానంగా అందించారు. మిగిలిన 66 శ్లోకములకు పుల్లెల రామచంద్రుడుగారు పూరించారు. ఇప్పుడు శ్యామశాస్ర్తీగారు మొత్తం 582 మూల శ్లోకాలను ఉదహరించి వాటికి అర్థము, తాత్పర్యము తెలుగులో ఇవ్వడం దీని ప్రత్యేకత. ఈ మూల గ్రంథం లోగడ దేశ విదేశీ భాషలన్నింటిలోనికి అనువదింపబడి సరళమైన తెలుగులో వచ్చేందుకు శ్యామశాస్ర్తీగారు చేసిన ప్రయత్నం ఫలించిందనే భావించాలి. అద్వైత సిద్ధాంతం పట్ల ఆసక్తిగల వారందరూ ఈ గ్రంథాన్ని చదివి ఆనందింపవచ్చు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్