AADIVAVRAM - Others

స్వీయ చిత్రం కాదు.. స్వీయ మృత్యువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి కాంత
తన ఒంపుసొంపులతో
కనువిందు చేస్తూ
తనువు పులకింపచేస్తూ
బిగి కౌగిల్లో ఒదిగిపొమ్మని
తనతో జ్ఞాపకాలు పదిలపరచుకోమని
రా రమ్మంటూ రెచ్చగొడుతుంది
ఆ మైకంలో
ఆకర్షణ తమైకంలో
స్వీయ చిత్రాలు తీస్తుంటే
విష కౌగిట్లో బంధిస్తుంది
విషాదపు లోయలోకి తోస్తుంది.
అనుబంధాల దుప్పట్లో
ఆనందానుభూతులను
కన్న ప్రేమను, ప్రేమ సుగంధాన్ని
ఆవిరి చేస్తూ..
జీవిత కన్నీటి చిత్రపటమై
గుండె గోడలకు వేలాడదీస్తూ
క్షణం క్రితం వరకు విరబూసిన
ప్రేమ సుమాన్ని మాడి మసి చేసి
మృత్యుపాశం విసిరి
విషాద వినోదం చూస్తుంది
అప్పుడే రెక్కలొచ్చిన పక్షుల
కిలకిలారావాలు మాయమై
హాహాకారాలు, ఆర్తనాదాలు మిన్నంటి
గూడు చెదిరి కలలు కల్లలై
జీవితాలు తెల్లారుతున్నాయి
ప్రదేశం ఏదైనా
దృశ్యం వేరొకటైనా..
ఓ స్వీయ చిత్రమా!
బతుకులు బండలు చేయకు.

-వేమూరి శ్రీనివాస్ 9912128967