Others

ప్లాస్టిక్ గురించి.. మనకు తెలిసింది.. తెలియనిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1867లో కొంతమంది కెమికల్ ఇంజనీర్లు సాధించిన విజయం అది. అప్పటికే వారు పదేళ్ళుగా పెట్రోలియం నుండి కొన్ని హైడ్రోకార్బన్ అణువులను వేరుచేసి, వాటిని ఒకదానికొకటి అతికించడం ద్వారా సన్నటి దారపు పోగులను రూపొందించాలని ప్రయత్నిస్తున్నారు. అలా వచ్చిన దారపు పోగులను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో డ్రింక్ బాటిల్స్, బార్బీ బొమ్మలు ఇంకా రకరకాల వస్తువులను తయారుచెయ్యవచ్చని ఆ ఇంజనీర్ల ఆలోచన. వారు ఆ క్రొత్త పదార్థాన్ని రూపొందించిన క్షణమే ప్రపంచ పారిశ్రామిక గతిని, వస్తు వినిమయ గతిని మార్చివేసింది. ఆ ఇంజనీర్లు అంత శ్రమపడి రూపొందించిన ఆ పదార్థమే ప్లాస్టిక్. అవును.. నేడు ప్లాస్టిక్ లేని జీవితాన్ని ఊహించలేం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 20 లక్షల నుండి 3,800 లక్షల టన్నుల ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ఆధునిక పారిశ్రామిక ప్రపంచం సాధించిన ఒక అద్భుతం ప్లాస్టిక్! ఈ ప్లాస్టిక్ మన జీవనానికి అన్నిరకాల సౌలభ్యాలనూ అందించింది. కానీ నాణేనికి రెండోవైపు అన్నట్లు ఈ సౌలభ్యం వెనుక పెను చీకటి వుంది. అదే ప్లాస్టిక్ కాలుష్యం! నేడు ప్రపంచంలో అన్ని స్థాయిలలోనూ, అందరినీ ఆందోళనలకు గురిచేస్తున్న సమస్య ఇదే. 1960ల నుండి ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా వెలువడిన 6,300 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల్లో 9 శాతం వ్యర్థాలను మాత్రమే రీసైక్లింగ్ చేయడం జరిగింది. ఇంకో 12 శాతం వ్యర్థాలను కాల్చి బూడిద చేశారు. ఇక మిగిలిన ప్లాస్టిక్ చెత్తంతా పల్లపు ప్రాంతాలలోనో, సముద్రాలలోనో డంప్ చేస్తున్నారు. ఈ వ్యర్థాలలో ఎక్కువగా డిస్పోజబుల్ గ్లాసులు, డ్రింక్ బాటిళ్ళు, తినుబండారాలకు, చుట్టడానికి ఉపయోగించే రేపర్లు - ఇలా ఒక్కసారి కంటే ఎక్కువసార్లు ఉపయోగించటానికి వీల్లేనివే వుంటున్నాయి. ఇవి ఎక్కువగా అమెరికా, ఐరోపా దేశాలనుండే ఉత్పత్తి అవుతున్నాయి. అంటే ఆ దేశాలనుండి ఎంత విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాలు డంప్ చేయబడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ర్వాండా వంటి దేశాలు ప్లాస్టిక్ సంచులను నిషేధించాయి. కెన్యా ప్రభుత్వం అయితే వస్తువులు కొనేవారికి ప్లాస్టిక్ సంచులను ఇచ్చే దుకాణాల యజమానులకు నాలుగు సంవత్సరాల కారాగారవాస శిక్ష లేదా 14 వేల డాలర్ల జరిమానా విధిస్తూ 2017లో చట్టం చేసింది. 2018 జనవరిలో ప్లాస్టిక్ వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించింది. యూరోపియన్ యూనియన్ 2030 నాటికి ఐరోపాలోని ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ రీసైక్లింగ్ చేయాలనీ, ఇక ముందు ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ ఉత్పత్తులు రీసైక్లింగ్ చేయడానికి వీలుగా ఉండాలనీ ‘ప్లాస్టిక్ స్ట్రాటజీ’ ఏర్పాటుచేసుకున్నారు. అందులో భాగంగా రాబోయే 7 సంవత్సరాలలో 30 నుండి 55 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంగ్లాండులో ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని 85 శాతం వరకు తగ్గించేశారు. తమ దేశంలో ప్లాస్టిక్ స్ట్రాల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని బ్రిటన్ పర్యావరణ కార్యదర్శి మైఖేల్ గోవ్ పిలుపిచ్చేరు.
ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించిన ఆరోపణల నుండి తమ మర్యాదను కాపాడుకునేందుకు ఇపుడిపుడే బడా కంపెనీలు తమ పద్ధతులను మార్చుకుంటున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలలో కోకోకోలా, పెప్సీ వంటి శీతల పానీయాలకు చెందిన కంపెనీల సీసాలు, వాటి అవశేషాలే అధికంగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తమ కంపెనీ సీసాలను రీసైక్లింగ్ చేసి, వాటిలోనే తిరిగి శీతల పానీయాలను సరఫరా చేస్తామని కోకోకోలా ప్రమాణం చేసింది. వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే పెద్ద పెద్ద కంపెనీలైన యూనీలివర్, ప్రోక్టర్ అండ్ గాంబ్లర్ తమ ఉత్పత్తులలో రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌నే ఉపయోగిస్తామని పేర్కొన్నాయి. 2025 నాటికి తమ ఉత్పత్తులన్నిటికీ రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ సంచులనే ఉపయోగిస్తామని, తమ రెస్టారెంట్లలో స్ట్రాలు, మంచినీళ్లకు వాడే కప్పులు మొదలైనవన్నీ రీసైక్లింగ్‌చేసిన ప్లాస్టిక్‌తోనే రూపొందిస్తామని మెక్‌డొనాల్డ్ పేర్కొంది.
ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా 36 లక్షల ఘనవ్యర్థాలు డంప్ చేయబడుతుండగా అందులో 10 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే. భూమీద కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవు. ఒకవేళ వాటిని ఒకచోటినించి తీసినా మరోచోట పారబోయాలి. ఈ తలనొప్పి వ్యవహారాన్ని తప్పించుకోవడానికి మనమేం చేస్తున్నాం? ఆ వ్యర్థాలన్నింటినీ పెద్ద ఎత్తున సముద్రంలో డంప్ చేస్తున్నాం. ఈ వ్యర్థాలన్నీ సాగర జలాల ప్రవాహానికి కొట్టుకొని పలు తీరాలకు వ్యాపిస్తున్నాయి. వీటిలో కొన్ని చీలిక పేలికలైపోయి మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలుగా సముద్రంలో అన్ని స్థాయిలలోనూ పేరుకుపోతున్నాయి. వీటన్నింటినీ వెలికితీయడమూ పెద్ద సమస్యే. అసలే భూమిమీద భరించలేక సముద్రంలో పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి వెలికితీసి ఎక్కడ నెత్తిన పెట్టుకుంటాం? ఇప్పటికే ఐరోపాదేశాలలో ప్రతి పదిమందిలో తొమ్మిదిమంది ప్లాస్టిక్ కాలుష్య ప్రభావానికి గురై ఇబ్బందులు పడుతున్నారు. మిగతా కాలుష్యాలలా కాకుండా ప్లాస్టిక్ కాలుష్యం మన కళ్ళకి చాలా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.
నాలుగు వందల జాతులకు చెందిన జంతువుల పొట్టలలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు చేరడమో లేదా ఆ వ్యర్థాలలో ఈ జంతువులు చిక్కుకుని ఇబ్బందులు పడుతుండటమో జరుగుతోందని పరిశోధకులు అంటున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నుండి వెలువడే విష రసాయనాలకు అవి బలవుతున్నాయి కూడా.
‘ప్లాస్టిక్ కాలుష్యంవల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా లక్షా 39వేల కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లుతోంది అని ట్రూకాస్ట్ పేర్కొంది. ఇది స్టాండర్డ్ అండ్ పూర్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌సి అనే అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీకి చెందిన పరిశోధన సంస్థ. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఈ నష్టంలో సగం ప్లాస్టిక్ వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలనుండి వెలువడే విషవాయువులవల్ల, ఆ ప్లాస్టిక్ ఉత్పత్తులను, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను రవాణా చేసే వాహనాల నుండి వెలువడే విషవాయువులవల్ల కలుగుతోంది.
ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంవల్ల సముద్ర జలాలు ఆమ్లపూరితాలై 2,100 సంవత్సరం వచ్చేసరికి ప్రపంచదేశాలు సగటున ఏడాదికి 21 లక్షల కోట్ల డాలర్ల మేరకు పర్యావరణపరమైన, ఆర్థిక పరమైన నష్టాన్ని ఎదుర్కోనున్నాయని యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం సంస్థ పేర్కొంది.
మొదటినుంచి మనలో ప్లాస్టిక్ అంటే ఒక విధమైన చులకన భావం ఉంది. వాడడానికి సౌలభ్యంగా ఉండడం, చవకగా ఉండడం మనలో ప్లాస్టిక్ వాడకంపట్ల మోజు పెంచి ఉండవచ్చు. లోహాలతో చేసిన వస్తువులు అయితే మాత్రం దెబ్బతిన్నా సరిచేసుకోవచ్చు. సొట్టలు పడితే మాట్లు వేసుకోవచ్చు. బీటలు పడితే అతుకు వేసుకోవచ్చు. ఏ విధమైన మరమ్మతులకూ పనికిరాకపోతే అమ్మేసుకోవచ్చు. కనీసం లోహం ఖరీదు ముడుతుంది. కానీ ప్లాస్టిక్ విషయంలో అలా కాదు. ప్లాస్టిక్ ఎంత ఖరీదైనది అయినా, కొత్తది అయినా సరే అది ఏ మాత్రం దెబ్బతిన్నా ఎందుకూ పనికిరాదు. బయట పారేయాల్సిందే. వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్, స్ట్రాలు, క్యారీబ్యాగ్స్, డిస్పోజబుల్ గ్లాసులు, సిరంజీలు.. ఇలా ఎన్నో వస్తువులు అవసరం తీరేవరకు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, అవసరం తీరిన మరుక్షణం అవి మనకు చెత్తతో సమానం. భూగోళంపై ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోవడానికి ప్లాస్టిక్ పట్ల మనలో గల వ్యర్థ్భావన కూడా ఒక కారణమేమో!! ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పి అయి కూర్చుంది.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 8008264690