Others

చికాకుకి చెక్ పెట్టేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెప్పలేనంత చికాకు.. తరచుగా మూత్రం వెళ్ళాలనిపించడం, వెళ్లిన ప్రతిసారీ విపరీతమైన మంట, మూత్ర విసర్జనను ఆపుకోలేకపోవడం.. ఇవన్నీ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు. పిల్లల్ని కనే వయస్సులోనే కాదు, మెనోపాజ్ దశలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్య బారిన పడే మహిళలు అరవై శాతం ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి సమస్య కనిపించినప్పుడల్లా వైద్యురాలు దగ్గరకు వెళ్లడం, మందులు మింగడం మామూలే.. కానీ కొద్దికాలానికే ఈ సమస్య మళ్లీ మొదలవుతుంది. ఇలా తరచూ ఇబ్బందిపెట్టే ఈ సమస్యను శాశ్వతంగా దూరం పెట్టడం ఎలా? అని చాలామంది మహిళలు అనుకుంటూ ఉంటారు. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువ. సాధారణంగా యోని మార్గం చుట్టూ ఎప్పుడూ బాక్టీరియా ఉంటుంది. ఈ బాక్టీరియా సంఖ్య రెట్టింపై అవి మూత్రకోశంలోకి చేరినప్పుడు మాత్రమే ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. మహిళల మూత్రద్వారం నుంచి మూత్రాశయాన్ని కలిపి మూత్రనాళం పొడవు కేవలం 1.5 అంగుళాలు మాత్రమే ఉంటుంది. దాంతో మూత్రద్వారానికి సోకే బాక్టీరియా ఇట్టే మూత్రాశయంలోకి వెళ్లిపోతుంది. దాంతో మహిళలు త్వరగా ఇన్‌ఫెక్షన్లకు గురవుతారు. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తరచుగా వస్తుంటే దాని ప్రభావం మూత్రపిండాలపై ఉంటుంది. ఇలాగే తరచూ జరిగితే అవి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్స్ రాకముందే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ చికాకుకు స్వస్తి పలకవచ్చు.
* తరచూ బాత్‌రూముకు వెళ్లడం వల్ల మూత్రం నుంచి బాక్టీరియా బయటకు పోతుంది. ఇన్‌ఫెక్షన్ కూడా తగ్గుతుంది.
* నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. తరచుగా మూత్రం రంగుని పరిశీలించుకోవాలి. మూత్రం పసుపు రంగు కాకుండా పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలి.
* నీళ్లు ఎక్కువగా తాగితే మూత్రం పారదర్శకంగా ఉంటుంది. కాబట్టి గంటకోసారి మంచినీళ్లు తాగాలనే నియమం పెట్టుకోవాలి. భోజన సమయంలో మాత్రం రెండు గ్లాసుల నీళ్లను తాగాలి.
* వ్యక్తిగత శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. గాఢత తక్కువగా ఉన్న సబ్బులు, యాంటీసెప్టిక్ క్రీములు, స్ప్రేలు, పౌడర్లు వంటివి జననేంద్రియ భాగాల్లో వాడకూడదు.
* లోదుస్తులు కాటన్‌వి ఎంచుకోవాలి. వాటిని రోజుకు రెండుసార్లు మార్చాలి.
* లోదుస్తుల్ని ఆరునెలల పాటు మాత్రమే వాడాలి. వాటిని పడేసి తరువాత కొత్తవాటిని కొనుక్కోవాలి.
* కలయిక సమయంలో బాక్టీరియా యోనిమార్గం నుంచి మూత్రాశయంలో చేరుతుంది. ఆ బాక్టీరియా అలా ఉండిపోతే ఇన్‌ఫెక్షన్స్ వచ్చేస్తాయి. కాబట్టి కలయిక తరువాత మూత్ర విసర్జన చేయాలి. ఆ ప్రదేశాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.
* మలబద్ధకం ఉంటే ఇన్‌ఫెక్షన్లు త్వరగా వస్తాయి. కొన్నిసార్లు పెరుగుతాయి కూడా.. కాబట్టి పీచుశాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కాయగూరలు తీసుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తాగాలి.
* కొన్నిరకాల గర్భనిరోధకాల్లో స్పెర్మిసైడ్లు ఉంటాయి. ఇవి మేలుచేసే బాక్టీరియా సంఖ్యను తగ్గిస్తాయి. దాంతో హానిచేసే బాక్టీరియా పెరిగి ఇన్‌ఫెక్షన్ తప్పదు. కాబట్టి స్పెర్మిసైడ్లు లేని గర్భనిరోధకాలను ఎంచుకోవాలి.
* సాధారణంగా శరీరంలో తగిన రోగనిరోధక శక్తి ఉంటే.. బాక్టీరియా రెట్టింపైనా పెద్ద సమస్య ఉండదు. ఆ శక్తి తగ్గినప్పుడే సమస్య వస్తుంది. కాబట్టి తరచూ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లతో బాధపడేవారు రోగనిరోధక శక్తిపైనా దృష్టిపెట్టాలి.
* ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పీచు శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కాయగూరలు తీసుకోవాలి. రోజూ కనీసం అరగంటైనా ఏదో ఒక వ్యాయామం చేయాలి. ఇలా వారానికి మూడు రోజులైనా చేయాలి. ముఖ్యంగా శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి.
*