Others

యూనిక్ పాయింట్‌ని చూపించడానికి ప్రయత్నించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరింత, మనమంతా, జెర్సీవంటి ఫీల్ గుడ్ చిత్రాలతో మెప్పించిన విశ్వంత్ -అదేతరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుమదుర్గా క్రియేషన్స్‌పై దుర్గాప్రసాద్ మాగంటి నిర్మాతగా విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -తోలుబొమ్మలాట. విశ్వంత్ కథానాయకుడు. రాజేంద్రప్రసాద్, వెనె్నల కిశోర్, హర్షిత ప్రధాన తారాగణం. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన కథగా తెరకెక్కిన సినిమా 22న విడుదలవుతోన్న సందర్భంలో విశ్వంత్ మీడియాతో మాట్లాడాడు.
* జెర్సీ చేస్తున్నపుడే దర్శకుడు విశ్వనాథ్ ఈకథ చెప్పాడు. నచ్చింది, చేద్దామన్నాను. నిజానికి చాలామంది హీరోలను అనుకున్నా, ననే్న ఫైనల్ చేసుకున్నాడు. అప్పటికి జెర్సీ పూర్తవ్వకపోవడంతో తోలుబొమ్మలాట డేట్స్‌తో క్లాష్ వచ్చింది. దానికితోడు గౌతమ్ తిన్ననూరితో ‘మళ్ళీ రావా’ సినిమా చేయాల్సివుంది. అదీ మిస్సవుతోంది. జెర్సీని వదులుకోలేక, రెండూ హ్యాండిల్ చేయాలనుకున్నా సాధ్యం కాలేదు.
* మొదట కథను లైట్ వేలోనే విన్నా. మొగమాటం కారణంగా డైలాగ్ ట్రాక్ సరిగా వినలేదు. ఏ కథనైనా ఓకె చేయాలంటే రెండుమూడుసార్లు చదివి కానిచేయను. ఏదోకటి చేయాలనీ అనుకోను. అందుకే డేట్స్ కుదరకుంటే వదిలేస్తాననీ చెప్పా. అలాంటి పరిస్థితే వచ్చినా -కష్టపడి పూరిత చేశాం.
* సినిమాలో హీరో హీరోయిన్లు కనిపించరు. ఇదొక టిపికల్ పాత్ర. అలా కనిపిస్తే -సినిమా ఫెయిలైనట్టే. అందరి పాత్రలూ హైలెట్‌గా ఉంటాయి. తాత, మనవల పాత్రలు రియలిస్టిక్‌గా ఉంటాయి. ఫ్యామిలీ డ్రామాలో పాత్రలు కథకు తగినట్లే ఉండాలన్న రూల్‌ని దర్శకుడు చూపించాడు. కథే గొప్పది కనుక, పాత్రలు దాని లిమిటేషన్స్‌లోనే ఉంటాయి సినిమాలో.
* నా చిత్రాల్లో మరో పెద్ద హీరో ఉన్నాడన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. జెర్సీలో గౌతమ్ పాత్ర నాది. అయితే సినిమా అంతా నానిపైనే వుంటుంది. అందులో నేనో పార్ట్, అంతే. ముందే కథ విని ఒప్పుకున్నా. పెద్ద ప్రాజెక్టని అని సినిమా చేయలేదు. కథ బాగుంటే చాలు, మీటర్స్ పెట్టుకోను.
* తోలుబొమ్మలాట ఎలా వుంటుందంటే, ఫ్యామిలీ డ్రామాలు అనేక సినిమాలు చూసేశాం. ఒక ఫ్యామిలీలో అంతా ఒకచోట కలవడానికి వస్తారు. ఎవరూ చూపించని యూనిక్ పాయింట్ ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నించాం. కొన్ని రోజులు జరిగే జర్నీలో మనుషులు ఏవిధంగా మారిపోతారనే అనే చిన్న పాయింట్‌ని సినిమాలో హైలెట్‌గా చర్చించారు. గొప్పది మనిషి పుట్టుక అన్న పాట విన్నప్పుడే అందరికీ అర్థమై వుంటుంది. అందరూ వెళ్లిపోవాల్సిన వాళ్ళే. మధ్యలో జరిగే నాటకమే జీవితమనే లైన్‌లో సినిమా సాగుతుంది. బావామరదలి మధ్య ప్రేమ వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకునే తాత- ఇలా ఎమోషన్‌లో సాగుతున్నపుడు కథలో ఓ ట్విస్ట్ వస్తుంది.
* రాజేంద్రప్రసాద్‌తో నటించడం మొదట కొంచెం మొహమాటం, భయంగా వుండేది. కాని తరువాత అలాంటి ఫీలింగ్ రాలేదు. చాలా సరదాగా వుంటారు. ఆయన వచ్చి ముందు పలకరించడంతో ఫ్రీ అయిపోతాం. కాకపోతే ఆయనతో కామెడీ చేయడం కష్టం అనిపించింది. టైమింగ్ పట్టుకోవడమూ కష్టమే. సీన్ సరిగా చేయకపోతే చీవాట్లు లేవు కానీ హర్షిత మాత్రం తిట్టేసింది.
* వెనె్నల కిశోర్, రాజేంద్రప్రసాద్, నేను తోలుబొమ్మలాటలాడిస్తాం. ప్రతి ఒక్కరూ సందర్భాన్ని బట్టి ఆడిస్తారు. ఒకరినొకరు ప్రేరణపొందే అంశాలూ ఉంటాయి. డైలాగ్స్ కావాల్సిన సెన్స్‌లో బాగా వచ్చాయి. మిగతా టైమ్‌లో నార్మల్‌గా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు ఉంటుంది. సంగీతం కూడా సినిమాకు బూస్ట్ ఇచ్చేలా వుంది.
* 13 నిమిషాల క్లైమాక్స్ హైలెట్. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చుతుంది. దర్శకుడు మొదటి సినిమా అయినా బాగా డీల్ చేశాడు. ఎమోషనల్ అనేది యూనివర్సల్ పాయింట్ కనుక అలాంటి కథే ఎంచుకున్నాడు. తోలుబొమ్మలాటలో మన బంధువులు కూడా వున్న ఫీల్ కలుగుతుంది.
* ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాను. భవ్య క్రియేషన్స్‌లో ఒకటి వస్తుంది. డిసెంబర్ చివరికి మరో సినిమా తీసుకురావాలనుకుంటున్నాం. అదొక బ్యూటిఫుల్ థ్రిల్లర్ కానె్సప్ట్. సోలో హీరోగా నటించా. కాదల్ అనే మరో చిత్రం, కాకినాడ కుర్రోడు అనే డిఫరెంట్ సినిమా త్వరలో వస్తాయి.