Others

గ్రంథాలయంబది.. అమృతకిరణంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. ఆనత గైర్వాణి అంబుజాసనురాణి
కింకిణీక్వాణంబు క్రీడ గాదె!
అజ్ఞాన మయతామసాబ్ధివిహారికి
వేడుకౌ దివ్వెల ఓడ గాదె!
మెదడుకు మేతౌచు ఎదకుజ్ఞానఫలంబు
నిడి సేద దీర్చెడి నీడగాదె!
పయనించు మనుజుని బ్రతుకు టెడారిల
తోడౌ ఒయాసిస్సు జూడగాదె!
బహుళ పక్ష సంస్కృతికి ఆస్పదముగాని
మేలిముదమిడు వెనె్నల మేడ గాదె!
భవ్యభారత కీర్తిగా పరిఢవిల్లు
అమృతకిరణంబు గ్రంథాలయంబుగాదె!

రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287