Others

సభకు నమస్కారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలాసఫీ ఆఫ్ ఆర్ట్ ప్రకారం హాస్యం అంటే ‘లాఫర్ కమ్స్ యాజ్ ఏ రిలీజ్ యట్ ది పంచ్ లైన్ ఆర్ కంక్లూజన్ ఆఫ్ ద జోక్. దిస్ క్లెయిమ్స్ దట్ హ్యూమర్ ఎరైజెస్ ఫ్రమ్ ఫీలింగ్ సుపీరియర్ టు సమ్‌బడీ ఎల్స్’- హాస్య బ్రహ్మ శంకర నారాయణగారి గురించి మన రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. హాస్యాన్ని అపహాస్యంపాలు చేయకుండా తనదైన శైలిలో అందరికీ ఆనందాన్ని పంచుతూ ఎన్నో అవార్డులు రివార్డులు గౌరవ పురస్కారాలు విదేశీ పర్యటనలు చేసిన నవ్వుల నవాబు. జర్నలిజం వృత్తిలో వీరికి అనుభవం చాలా వున్నది. వివిధ పత్రికలలో పనిచేయడమే కాకుండా నాస్తిక పత్రిక ‘చార్వాక్’కు సంపాదకుడిగా ఉండి చివరికి సత్యసాయిబాబా భక్తుడిగా మారడం, వాస్తుశాస్త్రంలో పేరు గడించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ సందర్భంగా ఏదో ఆ భగవంతుని దయవలన సభ సవ్యంగా జరిగింది అని ఒక హేతువాది అన్నమాట జ్ఞప్తికి వస్తే తప్పు నాది కాదు.
డా. శంకర నారాయణగారు నోటితోపాటు చేతితో పనిచేసే కార్మికుడు. తాను బి.కాం మొదటి సంవత్సరం చదువుతున్నపుడే అగ్ని సంగీతం అనే కవితా సంపుటి వ్రాసిన ప్రతిభగల వ్యక్తి.
కవిత్వం అంతిమ లక్ష్యం సమాజంలో మంచి మార్పు తీసుకురావడం. సాధారణంగా ఒక విషయాన్ని సామాన్య ప్రజలు ఎలా వ్యక్తపరుస్తారో అదే విషయాన్ని ఎవరూ ఊహించని కోణంలో ఆ విషయాన్ని తెలియపరిస్తే అదే కవిత్వం. పాఠకుడి హృదయాన్ని కదిలించి ఆలోచింపజేసేదే మంచి కవిత్వం అవుతుంది. ఇలాంటి లక్షణాలు శంకర నారాయణగారిలో పుష్కలంగా వున్నాయి.
‘సభకు నమస్కారం’ అనే ఈ పుస్తకంలో మొదట ముప్ఫై రెండు కవితలు ప్రచురించారు. అన్నీ సమాజంలో ప్రస్తుతం జరిగే సంఘటనలనే కవితా వస్తువులుగా తీసుకున్నారు. అంత్యప్రాసలపై, పదాల విరుపుపై మంచి పట్టు వున్న రచయిత వీరు.
తన పేరుతో శంకరన్న పదాలు, సామెతలు, కేశభక్తి, ఆడవోయి భారతీయుడా, మొండిపెళ్ళాం, స్వర్గస్తుడికి ప్రేమలేఖ, ట్రంపు - పంపూ అంటూ వివిధ అంశాలపై తనదైన శైలిలో హాస్యాన్ని చిందిస్తూ సందేశాన్ని జోడించి వ్రాశారు. చివరకు డ్రాయర్, లుంగీని కూడా వదలలేదు.
తరువాత తాను పనిచేసిన పత్రికలలో ప్రచురితమైన ఎనిమిది సంపాదకీయ వ్యాసాలను పొందుపరిచారు. కవులలో వున్న ఆత్మాతిశయ ధోరణులను ముందుతరంవారికి, మధ్యకాలంవారి నేటి రచయితలు ఎలా ప్రదర్శించిన విధానాలను విశదీకరించారు. ఎన్నికల బీదరికం, మందిపోటు దొంగలు, రాజకీయ హాస్యవల్లరిని చాలా గమ్మత్తుగా విమర్శిస్తూ వ్రాశారు..
37 సంవత్సరాల పాత్రికేయ రంగంలో 36 చోట్ల ఉద్యోగాలు చేస్తూ అవధాన ప్రక్రియలో అప్రస్తుత ప్రసంగంలో తిరుగులేని ప్రతిభను కనపర్చడం వీరి బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. ఇది సామాన్యులకు సాధ్యంకాదు. బహుశ వారి తల్లిగారు వెంకట నర్సమ్మ గారు అన్నట్లు కంత్రీగార్లకే ఇలాంటివి సాధ్యం. వారి అమ్మగారి వాక్కును ఈ విధంగా నిజం చేసి ధన్యులయ్యారు.
ఇక ఆఖరుగా ఒక్క మాట- ఈ పుస్తకాన్ని శ్రీ కళా జనార్దనమూర్తిగారికి అంకితం ఇవ్వడం ఎంతో ముదావహం. కారణం- ‘ఏనాస్య పితరో యతః’ అన్నట్లు తండ్రిగారయిన స్వర్గీయ కళా సుబ్బారావుగారి అడుగుజాడలో నడుస్తూ కళామతల్లికి నిస్వార్థ సేవ చేస్తూ శ్రీ త్యగరాయగానసభను దిగ్విజయముగా నడిపిస్తూ ఎందరో కళాకారులకు, కవులకు, గాయకులకు సహాయ సహకారాలు అందిస్తున్న జనార్థనమూర్తిగారికి ఈ పుస్తకం అంకితం ఇవ్వడం నిజంగా సమంజసనీయము మరియు హర్షణీయము.

-జన్నాభట్ల నరసింహప్రసాద్ 7995900497