Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

6
సంధిజాల మాయావరణంలో
కొత్త రుచులుదయిస్తూ- ఆగిన
అర్థోక్తికి ప్రకృతి సకర్మక సమాధానం అయింది
రగిలి ఉద్రిక్త క్షణంలా వచ్చిన ఓ పాట వెలుగులో
జీవన కఠోర సత్యం తెలుసుకున్నాను...
నీడ ఒకటి మెదిలింది నిలువెత్తు రూపం కట్టి
కనిపించని చైతన్యం కళ్ళెత్తినట్లు
కాలం నా మ్రోల కంకేళిని కలిసినట్లు
నీడ ఒకటి మెదిలింది నిలువెత్తు రూపం కట్టి...
దినం సూర్యుడ్ని కొల్లగొట్టి తరిమేస్తే
పాపం...!
కట్టు బట్టలతో నిష్క్రమిస్తున్నాడు
పడమటి కొండల మాటుకు జారుకుంటూ...
తుంటరిగాలి
ఒంటరితనాన్ని రెచ్చగొడుతుంటే
ఓపిగ్గా
నిరీక్షణలో ఒదిగిపోతున్న క్షణాల్ని ఏరుకుంటూ
ఇక్కడ
పక్కలు సరిచేసుకుంటున్నారు
నా చేతన
మానవ చరిత్రకు మరో పుటను అద్దుతోంది
నా గొంతు
జనం ఊపిరిగా భాషకు ప్రాణం
నేనిప్పుడు రక్తప్రవక్తను
ఇరు సంజల్ని గాలిపటాలు చేసి ఇక్కడే ఎగరేస్తున్నాను..
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404