Others

మంచి నిద్ర అవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యాలను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచినిద్ర అవసరం. రోజుకి ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోతే చాలా మంచిది. చాలా తక్కువమందికి పడకమీదికి చేరుకోగానే నిద్రపడుతుంది. అది అదృష్టంగా భావించవచ్చు. అయితే మంచం ఎక్కినా కూడా ఎక్కువమంది టీవీ చూడటమో, మొబైల్‌లో ముచ్చట్లు చెప్పుకోవడమో చేస్తుంటారు. ఈ రెండు పనులు చాలు నిద్రకు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి. ఇవేవీ చేయకపోయినా నిద్ర పట్టనివాళ్లు కొందరుంటారు. వీళ్లకి బుర్రలో సుడిగాలిలా ఆలోచనలు రేగుతుంటాయి. దాంతో మనసు చెదిరిందంటారు. నిద్రపట్టకపోవడానికి ఇలాంటి కారణాలెన్నో.. గాఢంగా, హాయిగా మంచి నిద్రకు దగ్గరవ్వాలంటే కొన్ని టిప్స్ తెలుసుకోవాల్సిందే. ఏళ్ల తరబడి చెబుతున్నదే అయినప్పటికీ నిద్రకుపక్రమించే ముందు ఆ ఆలోచనలేవీ మదిలో మెదలవన్నది ఆనాటి ప్రశ్న. కాబట్టి కొన్ని సూచనలూ సలహాలు బుర్రలోకి ఎక్కిస్తే నిద్ర దానంతట అదే వస్తుందన్నది తాజా ఉదాహరణ. ముందుగా నిద్రకు ఒక షెడ్యూల్ తయారుచేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే సమయం, మేలుకునే సమయం రెండూ కూడా క్రమం తప్పకుండా ఒకే సమయాల్లో ఉండేలా చూసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. అలా రోజూ కుదరనివాళ్లు కనీసం వారంలో మూడు రోజులపాటు రోజుకి అర్థగంట తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. కాఫీ, చాక్లెట్లలో కెఫెన్ వుంటుంది. కాబట్టి వాటికి దూరం. కెఫెన్ నిద్రపట్టకుండా చేయడమే కాకుండా నిద్రపోయిన తర్వాత కూడా మాటిమాటికీ మెసిలేలా చేస్తుంది. అంటే గాఢనిద్రకు దూరం చేస్తుందన్నమాట.
బాగా మెత్తగా లేదా గట్టిగా వున్న పరుపుమీద నిద్రపోవద్దు. పరుపు కొని తొమ్మిదేళ్లపైన అయితే లోపల స్ప్రింగ్ మాట్రెన్‌ను మార్చేయాలి. పొగ, మందు అలవాట్లకు దూరం కావాలి. ధూమపానం, మద్యం కూడా కెఫెన్‌లాగానే నిద్రపై ప్రభావం చూపుతుంది.
మనం చేసే వృత్తిలో పని వత్తిడి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నిద్రకు మూడు గంటల ముందు ఒత్తిడి ఉండకూడదు. మానసిక సమస్యలు, ఆందోళనకరమైన ఇతర అనారోగ్యాలుంటే వైద్యుల్ని సంప్రదిం చటం మంచిది. ఎలాంటి సమస్యలున్నా నిద్రపోయే ముందు వాటి గురించి ఆలోచించనే కూడదు.
కడుపునిండుగా తినో లేదా ఆకలితోనో నిద్రకు ఉపక్రమించొద్దు. పొట్ట నిండుగా ఉంటే నిద్రపట్టక అటూ ఇటూ కదులుతూ ఉంటారు. ఖాళీ పొట్టవల్ల అసౌకర్యంగా, గడబిడగా వుంటుంది.
నిద్రకు గంటముందే భోజనం చేయాలి. సినిమాలు చూస్తూనో, పార్టీలవల్లనో, టీవీ ప్రోగ్రాంలవల్లనో రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం వంటివి చేయొద్దు. ముఖ్యమైన కార్యక్రమాలను రాత్రిళ్ళు ఎంత త్వరగా పూర్తిచేసుకుంటే అంత మంచిది.
నిద్రకు బాగా ప్రాధాన్యతనివ్వాలి. నైట్ డ్యూటీ చేసేవాళ్లు టీ తాగడం మంచిది కాదు. నిద్ర మేల్కొనేందుకు టీ తాగుతారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్రకు కేటాయిచిన సమయంలో ఎలాంటి ఆలోచనలు రాకుండా, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ నిద్రపోతే చాలు. నైట్ డ్యూటీలోనైనా నిద్ర కళ్లకు దూరంగా ఉండొచ్చు.

- కేసు