Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

5
బాధను నింపుకున్న
గుండెనై ప్రవహిస్తాను
కడలి గర్భానికి చేరి ఆవిరినై
ఆకాశపు పొదుగును
ఆవిష్కరిస్తాను
నా శరీర భూరిజం ఆకాశధారకై
అఱ్ఱులు జాస్తోంది...
జలతారుగా మిసమిసలాడే
వానచినుకు
నా ఊహల పొడి మన్నులోకి
జారినపుడు
నే నింతా ఓ గింజనే
ఆత్మ విప్పుకున్న అడవినై
పూవునై పండునై
మనిషి గుండెలోకి
ప్రవేశిస్తాను
గిరి శిఖరాలమీద దేవదారువునై
దినం మోసం చేయని సూర్యజ్వాలని
గండూషిస్తాను
కావి సంజను మెదిపి -
కౌముదీ
నిశ్శబ్ద మధురగీతాన్ని
వెలిగిస్తాను..
చిగురు నీడలో సౌందర్య
స్వప్నాన్ని అల్లుకుంటూ
సేదతీరుతూ పక్షి
నీలి గగనంలోని మబ్బు
చిచ్చోకాన్ని
ముక్కుతో పొడుస్తోంది
నా ఆలోచనాగ్నిలో అడవి
అంటుకుంది...
రంగుల దండయాత్రలో
రేగిన
నవ్య హవ్య సురభిళ
ధూమం
పరిసరాల స్మృతులు అల్లిన
ప్రాపంచిక స్పృహగా
రంగుల్లో పొర్లుతూ
భాషల పుప్పొడితో
భాష్యాలు
వివరిస్తోంది
లిపి లేని భాష చూపులో
చిక్కుకుంది...
- ఇంకావుంది...

- సాంధ్య శ్రీ 8106897404