Others

మహిళల్లో రక్తహీనతా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఓ నానుడి. మనిషి శారీరకంగాను, మానసికంగాను, సామాజికంగాను, తాను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యం అంటారు. ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కు, జీవం వున్న ప్రతి వ్యక్తికి అత్యవసరమైనది ఆహారం. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, రోగ నిరోధకశక్తిని కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్థాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ‘తిండి కలిగితే కండగలదోయ్, కండ గలవాడే మనిషోయ్’ అన్నట్లు మనిషి ఎదుగుదలకు చక్కటి ఆహారం అవసరం. సరైన ఆహారం అందకపోతే మనిషి ఎదుగుదలలో లోపాలు సహజం. భారతదేశంలో రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య అధికమవుతున్నది. ద్రవరూపంలో వున్న శరీర నిర్మాణ ధాతువు లేదా కణజాలం రక్తం. జీవి మనుగడకు రక్తం అత్యవసరం. స్ర్తిలలో, పిల్లల్లో కనబడే ముఖ్యమైన బలహీనత రక్తం తక్కువగా ఉండటం. ఇది ముఖ్యంగా మూడు కారణాలవలన వస్తుంది. పౌష్టికాహార లోపం, రక్తం నష్టపోవడం, రక్తం తయారీలో అవరోధం. తెలంగాణలో రక్తహీనత పిల్లలను, గృహిణులను పట్టి పీడిస్తోంది. రక్తహీనత కారణంగా ఇతరత్రా వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా విడుదలైన ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019’ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారు. ఆరునెలలనుంచి ఐదేళ్లలోపు పిల్లలు 60.7 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇక 15 నుంచి 49 ఏళ్ల వయసుగల సాధారణ మహిళలు 56.9 శాతంమంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అదే వయసున్న గర్భిణుల్లో 49.8 శాతంమంది, అదే సమస్యతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మహిళల్లో రక్తహీనత సమస్య ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ విషయాలను తేల్చారు. మన దేశంలో సంప్రదాయ పద్ధతులే మహిళల్లో రక్తహీనతకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయట. రక్తహీనత సమస్య ఓసారి వచ్చాక అధిగమించడం కష్టంగా పరిణమిస్తోంది. పౌష్టికాహారం తీసుకోకపోవడంతో ఎక్కువగా ఈ సమస్య వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే సరిపడా ఆహారం తీసుకోకపోవడంతోపాటు విరామం లేకుండా పనిచేయడంవల్లే ఎక్కువమంది మహిళలను రక్తహీనత వెంటాడుతోంది.
భారత్‌లోని 10-15 ఏండ్లమధ్య వున్న యుక్త వయస్సు బాల బాలికలందరూ సరైన ఆహారాన్ని తీసుకోవడం లేదని యూనిసెఫ్ తాజా నివేదిక తెలిపింది. ఎత్తుకు తగిన బరువు, యుక్త వయస్సులో ఉండాల్సిన శరీర ధారుఢ్యం లేకపోవడం వంటి సమస్యలు వీరిని వేధిస్తున్నాయని నివేదిక పేర్కొన్నది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 6.3 లక్షలమంది యుక్తవయస్సు బాలికలు, 8.1 లక్షలమంది అబ్బాయిలనుంచి సేకరించిన సమాచారంతో యునిసెఫ్, నీతి ఆయోగ్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. 80 శాతం బాలబాలికల్లో ఐరన్, జింక్, విటమన్ ఏ, డి, బి12, పోలెట్ లోపం ఉంది. వీరు తీసుకునే సూక్ష్మ పోషకాలు లోపించటంవల్లే ఇది తలెత్తుతోంది. ముఖ్యంగా బాలికలు సరైన ఎత్తు లేకపోవడం, రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఐరన్ మాత్రలు, హెల్త్ చెకప్ వంటివి అమలుకాకపోవడం 25 శాతం బాల బాలికలను ప్రభావితం చేస్తుంది. మిజోరం రాష్ట్రంలో 22.5 శాతం, నాగాలాండ్‌లో 23.9 శాతం, మణిపూర్‌లో 26.4 శాతం మహిళలు ఉన్నారు. రక్తహీనత బాధితుల్లో 90 శాతానికిపైగా పేదలే ఉన్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడమే ఈ సమస్యకు కారణం. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు. ప్రజారోగ్యం పరంగా భారతదేశం చాలా వెనుకబడి ఉందని అనేక నివేదికలు పేర్కొంటున్నాయి. రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య అధికమే. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటినా ఈ దుస్థితి కొనసాగడం ఆందోళనకారకం. పేదరికం, పౌష్టికాహార లోపం, జన్యుపరమైన కారణాలు, అవగాహనాలోపం, రక్తహీన సమస్య తీవ్రస్థాయిని చేసింది. దేశంలో ఎక్కడ చూసినా బక్కచిక్కిన బాలికలు కనిపిస్తున్నారు. రక్తహీనత సమస్య విద్యార్థినుల మనోవికాసాన్ని దెబ్బతీస్తోంది. ఫలితంగా చదువులో రాణించలేకపోతున్నారు. ప్రతి వందమంది చిన్నారుల్లో 50 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భం దాల్చనివారితో పోలిస్తే ప్రసవం జరిగిన వారిలో రక్తహీనత ఎక్కువగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. గర్భిణులకు మాత్రమే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేస్తోంది. గర్భం దాల్చిన ఆరు నెలలకు, ప్రసవం తర్వాత 6 నెలల వరకు కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఆకుకూరలు, పండ్లు, సి విటమిన్ గల పదార్థాలు అధికంగా తీసుకుంటే రక్తహీనతను నివారించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే రక్తపరీక్షలు తీసుకుని తదనుగుణంగా వైద్యుల సలహాలు పాటించి రక్తహీనతతో బాధపడకుండా చూడాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి.

- కె. రామ్మోహన్‌రావు