Others

తరగతి పాఠాలు జ్ఞానవాకిళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన మార్కులు వేసే పద్ధతి అసాధారణంగా ఉండేది. ఒక విద్యార్థి రాసిన సమాధానాన్ని తరగతిలో ఉత్తమ విద్యార్థి రాసిన సమాధానంతో పోల్చేవాడు కాదు. ఆ విద్యార్థి గతంలో రాసిన సమాధానంతో పోల్చినపుడు అభివృద్ధి కనబడితే దానికే ఎక్కువ మార్కులిచ్చేవాడు. ఆయన విద్యార్థులను పూర్తిగా విశ్వసించేవాడు. పరీక్షల సమయంలో వారికి ఎలాంటి కాపలా పెట్టేవాడు కాదు. బాల బాలికల స్వేచ్ఛ ఆశ్రమ విద్యకు మార్గదర్శకంగా ఉండేది. ‘‘అతి చిన్న పిల్లవాడికి కూడా స్వేచ్ఛ ఎంత ముఖ్యమైనదో అర్థమయ్యేలా చెయ్యాలి’’ అని ఆయన సూచించేవాడు.
దేశంలోని అన్ని గ్రామాలలోనూ ప్రాథమిక పాఠశాలలు పెట్టాలని గాంధీకి ఉండేది. పాఠశాల లేదా కనీసం ఉపాధ్యాయుడైనా ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించినపుడే అది సాధ్యమని ఆయనకు తెలుసు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఏదో ఒక చేతివృత్తి నేర్వాలి. సాధారణంగా అది నూలు వడకటం అయి ఉండేది. నిజమైన సమానత్వం, ప్రపంచ శాంతి సాధించాలంటే దానికి సంబంధించిన ప్రయత్నం పిల్లల వద్దనుంచే ప్రారంభం కావాలని ఆయన విశ్వసించేవాడు. రాయడం, చదవడం, అప్పజెప్పడం అనే పనులు విద్యార్థులను వారి చేతులు ఉపయోగించనీయకుండా, శారీరక శ్రమ చేయడానికి సిగ్గుపడేవారిలా తయారుచేసేట్లయితే అలాంటి చదువుకన్నా నిరక్షరాస్యులుగా ఉండిపోయి రాళ్లు కొట్టుకోవడం మెరుగని ఆయన ఉద్దేశ్యం. తన మనుమడికి పత్తిని ఎలా పండిస్తారో, రాట్నం చక్రం ఎలా తయారుచేస్తారో, నూలునుండి బట్టలు ఎలా నేస్తారో, నూలు చుట్టలను ఎలా లెక్కపెట్టాలో ఆయనే స్వయంగా వివరించేవాడు. అలా ఆ పిల్లాడికి భూగోళం, ప్రకృతి శాస్త్రం, అంకగణితం, రేఖాగణితం, నాగరికత పెరుగుదల తదితర అంశాలు బోధించేవాడు.
ఎదిగిన విద్యార్థులకు నూలు వడకటంలో వున్న పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు గాంధీ అడిగేప్రశ్నలు చాలా కఠినంగా నూలు వడికే పనిలో వారికున్న నేర్పరితనాన్ని సిద్ధాంతపరమైన, ఆచరణాత్మకమైన సమస్యలు పరిష్కరించడంలో వారికున్న సామర్థ్యాన్ని వెలికితీసేవిగా ఉండేవి. పిల్లలకు ప్రాథమిక విద్య నేర్పడం ద్వారా వారికి కొంత ఊహ వచ్చేసరికి వారిని ఇంటికోసం ఎంతోకొంత ఆర్జించే సభ్యులుగా ఎలా చేయవచ్చో గాంధీ చూపించాడు. కానీ నరుూ తాలీమ్ లక్ష్యం విద్యార్థులకు వృత్తి నేర్పడం మాత్రమే కాదు; దాని ద్వారా వారిని సంపూర్ణ మానవులుగా తీర్చిదిద్దడం, కుర్చీలో కూర్చున్నంత మాత్రాన ఉబ్బితబ్బిబ్బు కావడం, చీపురు పుచ్చుకున్నంత మాత్రాన సిగ్గుపడటం విద్యార్థులకు అలవాటు కాకూడదని ఆయన కోరిక. ఒక మనిషి నైతిక ఔన్నత్యానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి అక్షరాస్యతా ఒక్కటే ఏ మాత్రం దోహదపడదని ఆయన నొక్కి చెప్పేవాడు.
విద్యార్థులకు తరచుగా ఇచ్చే ఉపన్యాసాలలోనూ, కాశీ విద్యాపీఠం స్నాతకోత్సవ ఉపన్యాసంలోనూ ఆయన విద్యార్థుల లక్ష్యం మంచి ఉద్యోగం, ఉపాధి సంపాదించడం మాత్రమే కాదనీ, జాతీయ జీవన విధానాన్ని బలపరచడం, ధైర్యవంతులైన పోరాట యోధులుగా, దృఢమైన వ్యక్తిత్వం కలవారిగా తయారుకావడమనీ నొక్కి చెప్పేవాడు. గ్రామీణుల జీవితాలను అధ్యయనం చేసి వాటిని మెరుగుపరిచే మార్గాల గురించి అనే్వషించడం కూడా విద్యార్థుల కర్తవ్యమేనని ఆయన బోధించాడు. లక్షలాదిమందిలో మూఢ నమ్మకాలను నిర్మూలించేందుకు, తాము అసమర్థులం అనే భావననూ పోగొట్టడానికి సామూహిక వయోజన విద్య అవసరమని ఆయన విశ్వసించాడు. విద్యమీద గాంధీ అభిప్రాయాలు రస్కిన్, టాల్‌స్టాయ్, ఠాగూర్‌ల అభిప్రాయాలతో ప్రభావితమయ్యాయి.
ఒక విద్యావేత్తగా ఆయన ప్రపంచంలో పేరు పొందిన ప్రయోగశీలుర సరసన నిలుస్తాడు. ఆయన బీహార్‌లో కొన్ని పాఠశాలలను, బెంగాలులో జాతీయ కళాశాలను, అహ్మదాబాదులో జాతీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇన్ని గొప్ప, వినూత్న ఆలోచనలున్న ఈ ఉపాధ్యాయుడికి ఆయన గ్రాడ్యుయేట్ కాదని (మెట్రిక్యులేషన్, లండన్‌లో బారిస్టరు మాత్రమే చదివాడని) ఆయన యుక్త వయసులో నెలకు 75 రూపాయల వేతనం కలిగిన ఉపాధ్యాయ ఉద్యోగం రాలేదు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614