Others

కార్తీక దీపమై మొక్కెద నిను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీహరా పాప సంహార! చిర శుభకర
పార్వతీ వర! శంకరా ! భవభయ హర!
మహిమ హిమగిరి సంచార! మదన దమన!
చిన్న కార్తీక దీపమై నిన్ను దలతు

శంభు శిపివిష్ట శితికంఠ శర్వ శరణు
శుద్ధ విగ్రహ శ్రీకంఠ శూలపాణి
శాశ్వతా! శశిశేఖరా! శంకర ! శివ!
శిరము పైకెత్తు దీపమై చేరెద నిను

భవ భుజంగ విభూషణ భర్గ ! భక్త
వత్సలా! భీమ! భూభూత భర్త ! భూతి
భూష! భగనేత్రభిత్ ! భక్త భువన తోష!
కృత్తికా దీపమై కాంతి గీతనౌదు

వ్యోమకేశ ! విశే్వశ్వర! వామదేవ!
విశ్వనాథ ! విరూపాక్ష ! వృషభ వాహ
విషగళాధర! వృషభాంక!వేదదాత!
ఒక్క కార్తీక దీపమై మొక్కెదను నిను

అంబికేశ! అనేకాత్మ ! అజ! అనంత
అంధకాసుర సూదన! అనఘ! అభవ!
అవ్యయ ! అనీశ! అవ్యక్త! అష్టమూర్తి!
క్షణము కార్తీక దీపమై కరుగ ఫలము

సర్వమయ సూక్ష్మతను సహస్రపద ! సాంబ!
సాత్త్వికా! సర్వ విజ్ఞాన! సామవేద!
స్ణాణువా! సహస్రాక్ష! సౌందర్యమూర్తి!
తిమిరమున్ తోలు కార్తీక దీపవౌదు!

కాల కాల కైలాసేశ ! ఖండపరశు
కవచి కామారి ఖట్వాంగి కాల కంఠ
కృత్తివాస! నమో కార్తికేయ జనక
చిన్న కార్తీక దీపమై సిద్ధి కాంతు

పశుపతి ! పినాక ధనుకర! పరశుపాణి!
పుష్ప దంత భేరి! పరేశ! పురహరం! హర
ప్రమథ గణనేత! పరమేశ! ప్రథమ పురష!
చలిపులిని చంపుకృత్తికా జ్వలన వౌదు

మంగళాంగ! మహాదేవ! మహిత చరిత
ఓ మహేశ! మృత్యంజయ! సోమదేవ
త్రిపుర భంజన! త్రయనేత్ర ! త్రిజగవంద్య!
క్షణము కార్తీక దీప సంక్రాంతి నేను

సోమ సూర్యాగ్ని నేత్ర ఉమామహేశ!
హవిష! నీల లోహిత! జగద్వ్యాపి యజ్ఞ
మయ! జటాధర! మమ్మేలు మన్మథారి
వెలుగు కార్తీక దీపమై నిలిచి కొలుతు !

పంచవక్త్ర లలాటాక్ష! పరమ గమ్య!
దక్షయజ్ఞ వినాశ! దుర్ధర్ష ! రుద్ర!
గిరీశ! గిరిధన్వి! ఋషి మనస్సరసిహంస!
నీ పద సమీప కార్తీక దీపమేను

నిగమ వర్ణిత జగదీశ ! నిర్వికార!
దక్షిణామూర్తి ముక్కంటి! మోక్షదాత!
హర! దిగంబర! మృగపాణి! యజ్ఞమూర్తి!
దీపమై కాంతు నీరూపు తృప్తిదీర !

హే సదాశివా! నీలలోహిత! కపాలి!
వీరభద్ర! విశే్వశ్వర! విశ్వవినుత!
హేత్రిలోకేశ ! త్రయమూర్తి ! హే స్వయంభు
వత్తి నేను, తైలము భక్తి! వహ్ని నీవు!

సత్య శివసుందరా భవా నిత్య శాంత
ఓ గిరీశ గిరిప్రియా భోగిభూష
హేప్రజాపతిగిరిధ్వనిసుప్రకాశ
ప్రమిదనై కార్తీకమ్మున ప్రణుతి జేతు

- కడియాల మధుసూదన రావు