Others

దసరాబుల్లోడు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకుటుంబ సపరివారంగా చూసి ఆనందించదగిన చిత్రం దసరాబుల్లోడు. జగపతి పతాకంపై విబి రాజేంద్రప్రసాద్ తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి అద్భుతంగా రూపొందించిన సినిమా. అక్కినేని, యస్వీఆర్, వాణిశ్రీ, చంద్రకళలాంటి ప్రధాన తారాగణంతో రూపొందించారు. పల్లెటూరి రైతు కుటుంబాల్లో వుండే సంప్రదాయాలు, విలువలు, అన్నాతమ్ముళ్ళ అనుబంధాలు, వదినా మరిదుల గౌరవభావనలు చూపించే సినిమా. ఎప్పుడో చిన్నప్పుడు దత్తు ఇచ్చిన తమ్ముడు గోపి (ఏయన్నార్)ని గారాబంగా చూస్తుంటారు అన్న వాసు (గుమ్మడి), అతని భార్య యశోధ (అంజలీ దేవి). మరో కుటుంబంలో ప్రసిడెంట్ భూషయ్య (ఎస్వీ రంగారావు) విజ్ఞుడు. కాకపోతే, గయ్యాళి భార్య బుల్లెమ్మ (సూర్యకాంతం)తో పడలేక, ఆమె నోటికి ఎదురుచెప్పలేక ఆవేదన చెందుతుంటాడు. బుల్లెమ్మ తమ్ముడు బుల్లియ్య (నాగభూషణం) స్వార్థపరుడు. భూషయ్య కూతురు నిర్మల (చంద్రకళ)ను గోపికిచ్చి పెళ్లిచేస్తే -వాళ్ల ఆస్తి మొత్తం తమ చేతుల్లోకి వస్తుందన్న బుల్లియ్య పన్నాగంతో బుల్లెమ్మ ఫోర్స్ చేస్తుంది. నిజానికి నిర్మలకు కూడా బావ గోపి అంటే ఇష్టం. అయతే బావ గోపి, సోదరి వరసైన స్నేహితురాలు రాధను ఇష్టపడుతున్నాడని తెలుసుకుంటుంది నిర్మల. ఈ క్రమంలో బుల్లియ్య పన్నాగం పారిందా? గోపి నిర్మలను పెళ్లి చేసుకున్నాడా? ప్రేమించిన రాధకు తోడయ్యాడా? లాంటి ప్రశ్నలకు సమాధానం మిగిలిన సినిమా. ఏయన్నాఆర్, ఎస్వీఆర్, వాణిశ్రీల నటన అద్భుతం. రాధ, గోపిల అమలిన ప్రేమ, వారిమధ్య సంఘర్షణ, గోపిని తన స్నేహితురాలు ప్రేమిస్తుందని తెలిసి తన ప్రేమను వ్యక్తం చేయలేకపోయన పాత్రలో చంద్రకళ.. బలమైన పాత్రలన్నీ కథను అద్భుతంగా నడిపిస్తాయి. ముఖ్యంగా చివరలో క్యాన్సర్ పేషెంట్‌లా నటించిన చంద్రకళ నటన అత్యద్భుతం. ‘చేతిలో చేయేసి చెప్పుబావా’, ‘ఎట్టాగో వున్నాది ఓలమీ, ఏటేటో అవుతుంది చిన్నమ్మి’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే’ లాంటి పాటలకు మామ కేవీ మహదేవన్ ఇచ్చిన బాణీలు అత్యద్భుతం. ఓ మంచి సినిమా -ఏయన్నార్, వాణిశ్రీల దసరాబుల్లోడు.

-పి మల్లిఖార్జున రాజు, డి గన్నవరం