AADIVAVRAM - Others

నేనున్నాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నీరు బరువుండదు
కానీ, ఎంతటి బరువునయినా తనలో
ఆపుకుంటాయి
ఎంతో వేదనను, ఎంతటి బాధనయినా
కనిపించకుండా తనలోనే దాచుకుంటాయి
ఉద్విగ్న భరిత క్షణాల్లో మాత్రమే
అవి ఎద దాటి బయటికి వస్తాయి
తల్లి తన పిల్లల కోసం పడే తపన,
తండ్రి తమ కుటుంబం కోసం అనుభవించే
నరకయాతన
భార్య భర్త కోసం పడే వేదన
భర్త భార్య కోసం పరితపించే తపన
ఇవన్నీ కూడా ఊహించలేనంత
ఊహకు అందనంత బరువుంటాయి
కానీ సందర్భానుసారమే గుండె బరువెక్కి
బయటికి లావా మాదిరిగా ఉప్పొంగుతాయి
ఆ కన్నీళ్లు కట్టలు తెంచుకుంటే
ఏ వంతెనలూ, ఆనకట్టలూ వాటిని ఆపలేక
నేనున్నాననే ధైర్యం తప్ప
అందుకే కన్నీళ్లు నేనున్నాననే మాట
వినగానే ఎంతటి
బరువునయినా అలవోకగా స్వీకరిస్తాయి
నేనున్నాననే మాటతో ఆ మనస్సుకు ఎంతో
ఊరట కలుగుతుంది.

-శ్రీనివాస్ పర్వతాల 9014916532