Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రచనను
చదివించేదెవరు?
ప్రభవించిన కిరణానికి చీకటి ఎదమీద
దాడి చేసే ప్రతిభ నైసర్గికం
కాలపు బరువు తీర్చుకోవాలని
మనిషిని తీర్చి ఉపాధి కల్పించటం వ్యాసంగికం..
ఇప్పుడు
పాటంతా పరుగెత్తే వసంతాన్ని
కాలానికి ఉగాది కానుక చేస్తా
ఇక్కడ
నా భావానికి లొంగిన ఈ తోటను
పరిమళాన్నీదుతున్న బంభారానికిస్తా
ఇవిగో ఇవి
తరళ తరంగ భంగిమలు
చిద్రుపలై లెచెను
ఇది
విపుల విశ్వవైభవాన పరమ సుఖము
విద్రుమమై పూచెను
చూడు చూడు తారావిరహ వేదికపై ఉషస్త్విషల విహారము
విషయవాసనా సరిత్ప్రవాహము..

3
తెలి ఉషస్సును తలల అలంకరించుకొని
మందంగా వీస్తున్న మలయగంధాన్ని పైఠాణి చేసుకొని
నిశ్శబ్ద హృదయ కుహరంలోంచి
వెలుతురు చిరునవ్వును మొలిపించుకొని
కోర్కెల శిఖరాల మీంచి దూకుతున్న ప్రాణంలో తడిసిపోయి
అందంగా తోస్తున్నది అవనీభవ బంధం..
చిర నవీన వన సఖలాలస లిపుడు
దిక్తటాన్ని సురభిళం చేస్తున్నాయి

‘‘ఈ మహిజ ప్రసూనముల కెక్కడి వీ నును చెనె తుంపురుల్
నీ మధుర స్వరూప మవనీ రమ డెందమునందు మాగెనో
యేమొకొ! వనె్న చినె్నలుగ నెయ్యడగాంచిన నీ కృపారస
శ్రీ మెఱసెన్ వసంతమును జిల్కిన యట్టుల రాగభావినీ!’’

నక్షత్రాలను వెదజల్లిన ఆకాశంలా
పూలను విరగబూచిన చెట్లు
అద్వైతంలో మునిగిపోయిన ఆలోచనాత్మక సరళిని
వెలారుస్తున్నాయి..
ఋతువుల యుద్ధంలో
సుమకేతనాన్ని ఎగరేసిన కాలపర్ణి
చైత్రమనే శబల వసనాన్ని ధరించి
‘‘రాగతప్త రుచిర ప్రణయంగా
ఆగమించు మహితాంశురవిన్ పూ
తీగ చాల్పు వినుతుంచి నివాళిన్
స్వాగతమ్మొసంగె’’..
దిశల్లోకి పోతోంది నిశాపతి చలువ
ఉషసుస్స వచ్చిందని నాలో నేను వేసుకున్న కేక..
- ఇంకావుంది...

- సాంధ్య శ్రీ 8106897404