Others

మహిమాన్వితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకమాసం అన్ని మాసములలో, అత్యంత పవిత్రమైనదిగా భావించ బడుతున్నది. ‘న కార్తీక సమో మాస:’ అని అత్రి మహాముని వచనము. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్థం. కార్తీక మాసంలో చేయదగిన పుణ్య కార్యక్రమాలలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, శ్రవణం, దీపారాధనం, దీప దానం, తులసిమాల ధారణం, సాలగ్రామ పూజ, దైవ పూజ, వనభోజనం మున్నగునవి. వీటిలో విశేష పుణ్య ఫలాలను ఇచ్చేది కార్తీక స్నానం.
జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది. ‘‘చంద్రుడు పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రములో సంచరించే మాసం కార్తీక మాసం’’. అంబా, దులా, నితంతా, అభ్రయంతీ, మేఘయంతీ, వర్షయంతీ, చూపూణికా అనే పేర్లతో పిలవబడే షట్కృత్తికలు కార్తీక మాసమునకు అధిపతులుగా చెప్పబడ్డారు. కృత్తికా నక్షత్రము కృత్తికలకు అధిష్టానము, అగ్ని స్వరూపము. అశ్విన్యాది 27 నక్షత్రములు దేవతలకు ఇంద్రియములుగా చెప్పబడ్డాయి. ‘నక్షత్రం దేవమింద్రియం’ అని శృతి. వాటిలో అతి ముఖ్యమైన తేజస్సును దేవతలకు అందించే నక్షత్రం కృత్తికా. అట్టి కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణిమాస్య కలిగిన ఈ మాసము కార్తీక మాసముగా, విశేష పుణ్యఫలదముగా చెప్పబడ్డది. చాంద్రమాన రీత్యా ఎనిమిదవ మాసమైన కార్తీకమునకు ఒక విశేష స్థానము కలదు. శరదృతువు ఉత్తరభాగములో వచ్చే కార్తీక మాసము నెలరోజులు పర్వదినాలుగానే భావిస్తారు.
ప్రత్యేకించి కార్తీక శుక్ల ఏకాదశి నుండి పౌర్ణమి వరకు పంచ పర్వాలుగా భావించ బడతాయి. కార్తీక శుద్ధ ఏకాదశి - ఉత్థాన ఏకాదశి ప్రత్యేకత ననుసరించి, ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతముగా చెప్పబడుచున్నవి. మహావిష్ణువు ఆషాడశుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉండునని, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థానము చెందును కావున దీనిని ఉత్థాన ఏకాదశి అనికూడా పిలుస్తారు. పీఠాధిపతులు, యతీశ్వరులు, మునులు ఈ వ్రతమును ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆహార నియమాలతో చేయడం జరుగుతున్నది. కార్తీక శుద్ధ ఏకాదశి లేదా ‘‘ఉత్థాన ఏకాదశీ’’ లేదా ‘‘ప్రభోదనైకాదశి’’ అంటారు. ప్రబోధనైకాదశి నాడు విష్ణుమూర్తి క్షీరాబ్ది నుండి బయలు దేరి క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు, లేదా మదన ద్వాదశి, యోగిని ద్వాదశి నాడు విష్ణువు...లక్ష్మి, బ్రహ్మ మున్నగు వారితో కలిసి బృందావనంలో ప్రవేశిస్తాడు. దీనిని క్షీరసాగరాన్ని మధించిన/చిలికిన దినంగా వ్యవహరిస్తారు. అమదేర్ జ్యోతిషీ గ్రంథ ప్రకారం చాతుర్మాస్య వ్రత సమాపనదినం. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది కార్తీక శుద్ధ త్రయోదశి.
విష్ణువు శంకరుడిని పూజించిన దినం వైకుంఠ చతుర్దశి. ఇది జాగరణ వ్రతం, ప్రతిమావ్రతం, లింగవ్రతం, ప్రబోధ వ్రతాలకు ఉద్దీపితమైనది. కార్తీక పౌర్ణమి శివునికి ప్రీతిపాత్రం. ముక్కంటి త్రిపురాసుడిని హతమార్చిన దినం. పార్వతి దేవి పాప పరిహారార్థం శివారాధన చేసిన దినం. బౌద్ధులకు చాతుర్మాస్య వ్రతారంభదినం.
ఇలా ఐదు దినాలను పంచ పర్వాలుగా ఆచరించడం సనాతన సాంప్రదాయాచారం. దేవాలయాలలో మూల విరాట్టుల అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, పూజలు చేస్తారు. భక్తులు ఆలయాల మధ్యగల ఉసిరిక వృక్షం చుట్టూ సాంప్రదాయ ప్రదక్షిణలు ఆచరించి, ఉసిరికలను దానం చేసుకుని, కార్తీక దామోదరునికి ప్రత్యేక పూజలొనరిస్తారు. మంగళ స్నానాలాచరించి, దొప్పలలో వెలిగించిన కార్తీక దీపాలను వదిలి పెడతారు.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494