Others

వలస వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే బస్సులు వస్తుంటై
పొయ్యే బస్సులు పోతుంటై
అయనా ప్రయాణికులు వుంటుంటరు

పూసవేర్ల బాలరాజు
ఎడమ చేతికి మేదరిబుట్ట తగిలించుకుని
పైత్యానికి ఒకారానికి
అల్లం మురబ్బా అంటూ
బస్సు బస్సు తిరిగి అమ్ముతుంటాడు

ఉడికించిన పచ్చి పల్లికాయ
మక్క ప్యాలాలు
బస్సు ఎక్కుతూ దిగుతూ
నోరూరిస్తూ అమ్ముతుంటరు

ఇక్కడ తల్లిదండ్రులకు
భార్యపిల్లలకు మెడలు ఇరిగే బాధను ఎత్తి
పుట్టెడు దుఃఖాన్ని వెంట మోసుకు
దేశాలు బతుకుపోతుంటారు

జనాన్ని వలవేసి పట్టాలని
చుట్టూ తీరొక్క దుకాండ్లు

చిన్నప్పుడు బస్సులో
ఊరికిపోవుడు అంటే పెద్ద గమ్మతి
బస్సు ముందుకుపోతుంటే
గిర్రున భూమి తిరగడం
అదో బాల్య వైభవం

ఇక్కడ వలసల డేగ కాళ్లు రక్కిన గుర్తులు
రక్తం కన్నీళ్లు కలగల్సిన చరిత్ర ఆనవాల్లు
సిట్ అండ్ స్టాండ్ బస్టాండ్
ఎదిరిచూపు వీడ్కోలు ఎదురెదురుపడి
ఇక్కడ తమ ఎత బుద్ది తీరా చెప్పుకుంటై

- జూకంటి జగన్నాథం