వినమరుగైన

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. చెడుగు లేనట్టి మంచినిఁ జిత్తమందు
స్థిరముగను నిల్పియుంబంచఁ దిరుగువాడు
దివికిఁ జేరినఁ గాని రుూ భువిన నిలచుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: చెడు అనేదే లేనటువంటి స్వచ్ఛమైన మంచిని హృదయమందు స్థిరంగా నిలుపుకుని, ఆ మంచిని పదిమందికి పంచే దిశలో తిరుగువాడు దేహయాత్ర చాలించినా ఈ భూమిపై శాశ్వతంగా నిలిచే ఉంటాడని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! లోకబాంధవా! ఈలోకానికి ప్రబోధించవయ్యా!

తే.గీ. కష్టసుఖములలో ఁ జక్క ఁ గలసియున్న
మనసు తేలిక బడుచుండు మహిత శక్తి
మంతులగుదురు హాయిగ మసలవచ్చుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అంతాకష్టసుఖాలలో పాలుపంచుకుంటూ సహజీవనం చేసుకొంటుంటే మనసు ఎంతో తేలిక పడిపోతుంది. అద్భుతమైన శక్తి మంతులు కూడా కాగల్గుతారు. కారణం అభద్రతాభావం తొలిగిపోవడమే. అలా చేస్తే అంతాహాయిగా సుఖసంతోషాలతో మనుగడ సాగిస్తారని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నీవైనా ఈలోకానికి తెలియజేయుమయ్యా లోకబాంధవా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262