Others

పశ్చిమ కనుమల్లో ఎన్‌కౌంటర్ల మోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ కనుమల్లోని మంజకండి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతోపాటు నలుగురు మావోయిస్టులు మరణించారు. వీరు కబని దళానికి చెందిన గెరిల్లాలుగా భావిస్తున్నారు. కొందరు గాయపడి తప్పించుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తే, కేరళకు చెందిన నక్సల్స్ వ్యతిరేక ‘్థండర్ బోల్ట్’ ప్రత్యేక పోలీసులు జరిపిన ఈ దాడిలో మరణించిన రెమా, సురేష్, కార్తి, మణివాసకం తమిళనాడుకు చెందిన వారని చెబుతున్నారు. ‘్థండర్ బోల్ట్’ పోలీసులకిది గొప్ప విజయంగా భావిస్తున్నారు. సంఘటన స్థలంలో ఎకె-47 రైఫిల్‌తోబాటు 303 తుపాకులు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తూర్పు కనుమల్లో (ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో) పరిస్థితి నిరాశాజనకంగా మారితే పోరాట స్థావరాన్ని పశ్చిమ కనుమలకు మార్చాలని మా వోలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్నాటకల కూడలిగా ఉన్న ‘ట్రై జంక్షన్’లో పాగావేసేందుకు మూడు నదుల పేర్లతో మూడు సాయుధ దళాలు పనిచేస్తున్నాయి. తాజాగా కబని దళానికి చెందిన నలుగురు గెరిల్లాలు కన్నుమూశారు. ఎ.కె.-47 తుపాకీ లభ్యమైందంటే కీలక నాయకుడొకరు హతమయ్యాడనే అర్థం. మూడేళ్ల క్రితం ఇదే పశ్చిమ కనుమల్లోని మళ్ళపురం జిల్లా నీలాంబర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ప్రముఖ మావోలు మరణించారు. మృతుల్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కొప్పారం దేవరాజం అలియాస్ యోగేశ్ ఉన్నాడు. ఆ ఎన్‌కౌంటర్‌తో మావోలకు గట్టి దెబ్బ తగిలింది. అంతకుముందు స్పెషల్ జోనల్ కమిటీ నాయకుడు రూపేశ్, అతని భార్య అరెస్టయ్యారు. కబిని, నాదుకని, భవాని గెరిల్లా దళాలకు మార్గదర్శనం చేసిన వారు అలా ఒక్కొక్కరు దూరమయ్యారు.
గిరిజన తెగలు నివసించే పశ్చిమ కనుమల్లో గెరిల్లా దళాలను నిర్మించి ‘జనతన సర్కారు’ను ఏర్పరచాలన్న ప్రయత్నం బెడిసికొడుతోంది. ఈ ప్రాంతంలో శ్రీలంక శరణార్థులు చాలామంది నివసిస్తున్నారు. వారిని ఆకర్షించేందుకు ‘పాట’ను ఆయుధంగా చేసుకుని మావోలు కదులుతున్నారు. శ్రీలంకలో ‘తమిళ టైగర్స్’ ప్రభావం కొంత వీరిపై ఉండే అవకాశముంది కాబట్టి వారిని తమ దళాల్లోకి, వివిధ సంఘాలలోకి చేర్చుకునేందుకు మావోలు ప్రయత్నిస్తున్నారు. మహిళా మావోలు ఈ శరణార్ధి శిబిరాల్లో, గూడల్లో తిరుగుతూ మిగతా ఆడవారిని దళాల్లోకి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో అనుసరించిన వ్యూహం, ఎత్తుగడలను పశ్చమ కనుమల్లోనూ అనుసరించి గిరిజనులను, మహిళలను తమ దళాల్లోకి ఆకర్షిస్తున్నారు. అయితే తూర్పు కనుమల్లో లభించినంత ప్రోత్సాహం- ఆదరణ పశ్చిమ కనుమల్లో కనిపించడం లేదు. అక్కడి ఆదివాసీలకు, ఇక్కడి గిరిజనులకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. మావోలు ఛత్తస్‌గఢ్‌లోకి ప్రవేశించిన సమయానికి, పశ్చిమ కనుమల్లోని ట్రై జంక్షన్‌లో ప్రవేశించిన కాలానికి ఎంతో తేడా ఉంది. దాంతో ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం కరువైంది. ఇందుకు కారణం మిగతా ప్రాంతాల గిరిజనులకన్నా ఈ ప్రాంత గిరిజనుల ఆర్థిక, సామాజిక పరిస్థితి కొంతమెరుగ్గా ఉండటమే. కేరళలో కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు-లెనినిస్టు, రీ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో కె.వేణు నాయకత్వంలో కొంతకాలం వామపక్ష తీవ్రవాద కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు వర్గీస్ పనిచేశారు. తరువాత ‘నక్సల్ బరి గ్రూపు’ పేరిట కొంతకాలం కార్యక్రమాలు జరిగాయి. ఈ గ్రూపు మావోయిస్టు పార్టీలో విలీనమయ్యాక కేరళలో వామపక్ష తీవ్రవాద కార్యక్రమాల జోరు పెరిగింది. కొంతకాలం షెల్టర్ జోన్‌గా ఉపయోగించినా తరువాత వ్యూహాత్మకంగా ‘ట్రై జంక్షన్’ను ‘ఆర్గనైజ్’ చేసేందుకు నిర్ణయించి గెరిల్లా దళాలను దింపారు. ఆ దళాలతోపాటు సాంస్కృతిక దళాలు వచ్చాయి, మరికొన్ని ప్రజాసంఘాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తూర్పుకనుమలకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ కనుమలను రూపొందించాలన్న ఆ పార్టీ నిర్ణయం మేరకు ‘‘సైలెంట్ వ్యాలీ’ కాస్త సందడిగా మారింది. అప్పుడప్పుడు తుపాకుల మోత ప్రతిధ్వనిస్తోంది.
కేరళ మార్క్సిస్టు మంత్రి ఎం.ఎం.మణి అమాయక ప్రజలను చంపుతున్న మావోయిస్టులు ‘కమ్యూనిస్టులు ఎలా అవుతార’ని గతంలో ప్రశ్నించారు. సామాన్యుల నుంచి డబ్బులు వసూలుచేస్తూ ఆయుధాలు పోగేస్తున్నవారు ప్రజాప్రేమికులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆ రోజుల్లో మణి మాటలు కేరళలో ప్రతిధ్వనించాయి. ఇలాంటి అనేక విమర్శలకు, తోటి కమ్యూనిస్టుల ప్రశ్నలకు మావోలు ఎన్నడూ సమాధానం చెప్పలేదు.
ఇటీవల అగలి- అట్టప్పాడి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ పాలక్కాడ్, వైనాడ్ జిల్లాల్లో మావోల కార్యాచరణ పెరిగిందనే విషయం చాటి చెబుతోంది. తూర్పు కనుమల్లోని ఝార్ఖండ్, బిహార్‌లకు చెందిన కొందరు మావో గెరిల్లాలు కేరళకు వచ్చారని పోలీసులు భావిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో సైనిక బలగాల, పోలీసుల ఒత్తిడి అనూహ్యంగా పెరగడంతో ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు, కొత్త స్థావరాలను ఏర్పరచుకునేందుకు పాలక్కాడ్ ప్రాంతానికి తరలి వచ్చి ఉంటారని నిఘావర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. మావోల కదలికలను పసిగట్టిన థండర్ బోల్ట్ దళాలు పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించి తాజా ఎన్‌కౌంటర్‌కు పూనుకున్నాయని తెలుస్తోంది. గత మార్చిలో 29 ఏళ్ల జలీల్ అనే మావోయిస్టును ఈ దళాలు మట్టుబెట్టాయి.
మావోల పశ్చిమ కనుమల జోనల్ కమిటి క్రియాశీలకంగా పనిచేస్తోందనడానికి ఇదే నిదర్శనమని కొందరి అభిప్రాయం. అలిగి ఎదురు కాల్పుల అనంతరం అటు కర్నాటక, ఇటు తమిళనాడు పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. తమ భూభాగాల్లోకి సాయుధ మావోలు చొరబడే అవకాశాలున్నాయని కేరళ పోలీసు ఉన్నతాధికారులు సందేశాలు పంపారు. కేరళలోని వైనాడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో మావోలు వివిధ రూపాల్లో పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఇవన్నీ ట్రై జంక్షన్‌లో అంతర్భాగంగా ఉండటం విశేషం. ఇటీవల వారాహిని పేర మరో దళాన్ని మావోలు ఏర్పాటుచేశారని తెలుస్తోంది.
మోదీ స్వప్నం..
ఈ ఎన్‌కౌంటర్, తదనంతరం గాలింపు చర్యలు జరుగుతున్న సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వార్షిక పెట్టుబడుల సదస్సు (ఎడారి దావోస్)లో ప్రసంగిస్తూ రానున్న ఐదేళ్ళలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునేలా లక్ష్యం నిర్దేశించుకున్నామని అందుకవసరమైన వ్యూహం రూపొందించామని ముఖ్యంగా వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవ వనరుల్ని, గరిష్టంగా వినియోగించుకోనున్నామని అందులో భాగస్వాములు కావలసిందిగా అక్కడి వారిని ఆహ్వానించారు. కృత్రిమ మేధ, నానో టెక్నాలజీ, జెనటిక్స్, నైపుణ్యాల అభివృద్ధి గూర్చి ప్రధాని ప్రస్తావించారు. మానవ కల్యాణానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉబికి వచ్చిందని దాన్ని ఒడుపుగా ఉపయోగించాలని అందుకే భారత్‌లో నైపుణ్యాభివృద్ధికి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఆవిష్కరణలు, స్టార్టప్స్, పరిశోధన- అభివృద్ధి (ఆర్-డి) రంగాల్లో విశేష కృషిజరుగుతోందన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సైతం ఇప్పుడు స్టార్టప్స్ పనిచేస్తున్నాయని, వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయని చెబుతూ వౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వర్తమానంలో వౌలిక సదుపాయాల ఆవశ్యకత కీలకమని గుర్తుచేశారు. ఆర్థిక పురోగతికి ఈ రంగం ఎదుగుదల ఎంతో అవసరమని ప్రధాని పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలున్నాయని వెల్లడించారు.
భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తూ ప్రధాని చేసిన ప్రసంగానికి ఇటు పశ్చిమ కనుమల్లో రక్తం ఏరులై పారించేందుకు మావోలు చెబుతున్న మాటలకు ఎక్కడా పొంతన లేదు. ప్రపంచమంతటా ‘ఐటీ’ రంగం విస్తరిస్తున్నట్టుగా కేరళలోనూ విప్పారుతోంది. సర్వీసుల రంగంలో కేరళ ఎంతో ముందున్నదని, అక్కడ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం కన్నా ఎక్కువని, సామాజికాభివృద్ధి సూచీలో అగ్రభాగంలో ఉందని రికార్డులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోల ‘నూతన ప్రజాస్వామిక విప్లవ’ నినాదం ఏమేరకు ప్రాసంగికం? మావోల ఆర్థిక ప్రణాళిక, రాజకీయ తీర్మానం, సాయుధ పోరాట ఎత్తుగడ... రాజ్యాధికారం కోసం రచించిన వ్యూహం... అన్నీ అపసవ్యమైనవే... అనర్థదాయకమే! అటు దావోస్, ఇటు ఎడారిలో దావోస్ (సౌదీ అరేబియా) వార్షిక పెట్టుబడుల సదస్సుల్లో ఉబికి వస్తున్న అభిప్రాయాలకు, ఆలోచనలకు, కార్యాచరణకు, సాంకేతిక పరిజ్ఞానానికి మావోల మాటలకు- వారు పేల్చే తూటాలకు ‘లంకె’ కుదురుతున్నదా? వారి మాటలకు మాన్యత ఉందనిపిస్తోందా? భారతదేశం సాధిస్తున్న ప్రగతి, పురోభివృద్ధి పట్ల అభివృద్ధి చెందిన జర్మన్ దేశ నాయకురాలు, చాన్సలర్ అంగెలా మార్కెట్ ఆసక్తి ప్రదర్శిస్తున్న సందర్భంలో మావోల సాయుధ పోరాట స్వప్నం సమంజసమైనదేనా?

-వుప్పల నరసింహం 99857 81799