Others

ఎవడే సుబ్రహ్మణ్యం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటా ఎన్నో వందల సినిమాలు థియేటర్లకు వస్తుంటాయ. అందులో మనం కొనే్న చూస్తుంటాం. అందులోనూ ఏ కొద్ది సినిమాలో నచ్చుతుంటాయ. ఆ కొన్నింటిలో బాగా గుర్తు పెట్టుకునే చిత్రాలు మరీ కొనే్న ఉంటాయ. అలా నేను గుర్తుపెట్టుకున్న చిత్రాల్లో -‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఒకటుంటుంది. సింగిల్ పాయంట్ స్టోరీయే అయనా పాత్రల చిత్రీకరణతో ఆడియన్స్‌ని కట్టిపడేసిన సినిమా ఇది. ఎదుగుతున్న ఇద్దరు వర్థమాన హీరోలు తన నటనా ప్రతిభను విశ్వరూపంలో చూపించిన సినిమా కూడా అనొచ్చు. ఈ చిత్రంలో సుబ్రహ్మణ్యం పాత్రలో నాని, రిషి పాత్రలో విజయ్ దేవరకొండ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ మైండ్‌లో గుర్తుండిపోతుంది. చాలా సజీవంగా నటించారు ఇద్దరూ. అలాగే నందిని పాత్రలో మాళవిక నాయర్ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే, రామయ్య పాత్రకు కృష్ణంరాజు తన అనుభవాన్ని జోడించి ఎంతో హుందాతనంగా నటించారు. ఎప్పటికైనా రిచ్‌మాన్ కావాలనేది సుబ్రహ్మణ్యం లక్ష్యం. రిచ్‌మాన్‌గా వుండటం కన్నా, గుడ్‌మాన్‌గా వుండాలనేది రిషి తత్వం. రిషి పద్ధతిని అస్సలు పట్టించుకోడు సుబ్బు. సుబ్బులోమార్పుతేవాలని రిషి పట్టుదల.
అనుకోకుండా ఆక్సిడెంట్‌లో రిషి చనిపోతే, నందిని ప్రోద్బలంతో సుబ్రహ్మణ్యం రిషి అస్థికలను దూద్‌కాశిలో కలపడానికి అయిష్టంగానే బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలో ఎదురైన ఓ మహిళ ప్రసవ వేదనను, అప్పుడే పుట్టిన పసిబిడ్డ యేడుపును దగ్గర్నుండి చూసిన సుబ్రహ్మణ్యం రిషిని గుర్తుచేసుకుంటూ నీవే కరెక్టురా అంటాడు. షావుకారు అనిపించుకోవడం కన్నా మంచివాడు అనిపించుకోవడమే ఉత్తమమనే సత్యాన్నీ తెలుసుకుంటాడు. గొంగళి పురుగునుంచి సీతాకోక చిలుక బయటికి వచ్చినట్లు, పశుపతి స్వార్థం వైపునుంచి, రామయ్య మానవత్వంవైపు సుబ్బు మరలిరావడం సినిమా ముగింపులో హైలెట్‌గా నిలుస్తుంది. నాని రెండురకాల మనస్థత్వాల నటన అద్భుతంగా వుంది. అశ్లీలతకు దూరంగా సందేశాత్మకంగా సినిమా కథను నడపడంలో నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ అడుగడుగునా కనపడుతుంది. అందరూ చూసి తీరవల్సిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం.’

-పి శాలిమియ్య, నందికొట్కూరు, కర్నూలు