Others

ట్రెండీ ట్రెండీ స్కర్ట్స్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగురంగుల సీతాకోకచిలుకల్లా అమ్మాయిలు ఇంట్లో హడావుడిగా తిరుగుతుంటే ఆ సందడే వేరు.. చిన్నారులు బుట్టబొమ్మల్లా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అదీ వారు ఫ్యాషన్-్ఫ్యషన్ డ్రెస్సుల్లో ముద్దుముద్దుగా ఉంటే ఆ ముచ్చటే వేరు. అలాంటి ఫ్యాషన్స్‌లో చెప్పుకోవాల్సింది స్కర్టుల గురించే.. తరాలు మారినా తరగని ట్రెండ్ దీని సొంతం. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో కనికట్టు చేస్తుంది. మరి కొత్త సంవత్సర శుభవేళ.. కొత్త కొత్త ఫ్యాషన్ స్కర్టులపై ఓ లుక్కేద్దామా..
స్కర్టు మనది కాదు.. కానీ మనదైపోయింది. మారుతున్న ఫ్యాషన్‌లతో పాటు అటు పాశ్చాత్య, ఇటు సంప్రదాయ శైలినీ కలిపి నయా డిజైన్లలో మెప్పిస్తోంది స్కర్టు.. మెత్తటి సిల్క్, లేదంటే పువ్వులా ఆకర్షించే షిఫాన్, అదీ కాదంటే మృదువుగా మనసును తట్టే లేస్.. ఫ్యాబ్రిక్ ఏదైనా సరే.. అది అమ్మాయి మేనిపై కొత్తగా హొయలు పోతుంది.. ట్రెండీగా, సొగసుగా ఉంటూ సందర్భాన్ని అనుసరించి సౌకర్యంగా సర్దుకుపోతుంది స్కర్టు. దీనిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ప్లీటెడ్, బయాస్, తులిప్, గేదర్డ్, టియర్డ్, లేయర్డ్, డబుల్ లేయర్డ్, హ్యాండ్ ఖర్చ్ఫీ, ఎసెమెట్రికల్, హై అండ్ లో, డబుల్ ప్యానల్, మినీ, మాక్సీ.. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి.
* చిన్నారులకు మోకాలి వరకూ ఉండే నీలెంగ్త్.., ఇంకాస్త కిందకు అంటే కాఫ్ లెంగ్త్‌లో ఉండే మాక్సీలు, ప్లీటెడ్, గేదర్డ్ స్కర్ట్‌లు బాగుంటాయి.
* చేనేత రకాల్లో వీటిని కుట్టించుకుని జేబులు, టాజిల్స్ వంటి అదనపు హంగులు చేరిస్తే ట్రెండీగా కనిపించవచ్చు.
* పార్టీలు, ఇతర వేడుకలకు మాక్సీ, ఎసెమెట్రికల్ స్కర్ట్‌లు బాగుంటాయి.
* తులిప్, పెన్సిల్, బాక్స్ ప్లీటెడ్ స్కర్ట్‌లు కాలేజీ విద్యార్థినులకే కాదు అప్పుడప్పుడే ఆఫీసులకు వెళ్లేవాళ్లకీ బాగుంటాయి.
* ట్రెండీగా కనిపించాలనుకునే అమ్మాయిలకు ఎసెమెట్రికల్ స్కర్టు చక్కని ఎంపిక. దీనికి కలీలు ఉండవు. జాలువారే ఫ్యాబ్రిక్‌తో కూడా అంచుల్లో ఎగుడుదిగుడు ఉండేలా డిజైన్ చేస్తారు. వీటిల్లో లేయర్డ్ డిజైన్స్ సన్నగా ఉన్న అమ్మాయిలకు బాగుంటుంది. ఈ స్కర్టుపైకి కాఫ్తాన్, టీషర్ట్ ఏదైనా ఎంచుకోవచ్చు. ప్లెయిన్ ప్రింటెడ్ మేళవింపులో ఎంచుకుంటే మరింత సౌకర్యంగా అనిపిస్తుంది.
* ఒకే ఫ్యాబ్రిక్ కాకుండా కాటన్, నెట్, జార్జెట్ వంటివాటిని కూడా ప్రయత్నించొచ్చు.
* ఏ-లైన్ డిజైనర్ స్కర్టు శరీరాకృతి సరిగా లేదనుకునేవారికి చక్కని ఎంపిక. వీటికి ప్యాచెస్, ప్యానెల్స్ ఉండవు కాబట్టి కాళ్లు సన్నగా ఉన్నవారు, పొట్ట కనిపిస్తుంది అనుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు.
* టీనేజీ పార్టీలు, వేడుకల్లో మ్యాక్సీ స్కర్టులు, హై అండ్ లో, జేబులతో మోకాలివరకూ ఉండే నీలెంగ్త్ బాక్సీ స్కర్టులు అదిరిపోతాయి.
* స్కూల్లో ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్, సెమినార్‌ల వంటి వాటికి పెన్సిల్ స్ట్రిప్ స్కర్ట్స్, షార్ట్ లేయర్డ్ తరహావి నప్పుతాయి. అయితే ఫార్మల్ వేర్ ఏదైనా మోకాళ్లకు రెండు ఇంచులు పైకి కానీ మూడు ఇంచుల కిందకు కానీ ఉండేలా చూసుకోవాలి.
* ఎంబ్రాయిడరీ, మోటిఫ్‌లు, బుటీల వంటి అదనపు హంగులు ఉండే రిచ్ ఫ్యాబ్రిక్‌ని ఉపయోగించినప్పుడు ప్యానల్ స్కర్టులా కుట్టించుకోవచ్చు. దీనే్న కలీ డిజైన్ స్కర్ట్ అంటారు. ఇవి స్వాగతోత్సవ వేడుకల్లో వేసుకోవచ్చు. జతగా క్రాప్ టాప్ మెప్పిస్తుంది. వీటిపైకి వీలైనంతవరకూ కనీసం రెండు అంగుళాల ఎత్తున్న చెప్పుల్ని ఎంచుకుంటే ఇక తిరుగుండదు. అందరి చూపూ మీ పైనే..