Others

రోగనిరోధక శక్తి పెరగాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలం మొదలైంది. దానికి తోడు అప్పుడప్పుడూ వర్షాలు.. ఇలాంటి వాతావరణంలో ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. తరచూ జలుబు.. అది కాస్త తగ్గుతుండగానే మళ్లీ జలుబు.. ఇలాంటి వాతావరణంలో ఈ లక్షణాలు కొందరిలో తరచూ కనిపిస్తుంటాయి. మనందరిలో కాస్త దగ్గు, జలుబు, రొంప, జ్వరం కనిపించగానే.. అలా మందుల దుకాణానికి వెళ్లడం.. ఏదో ఒక యాంటీబయాటిక్ కొని వేసుకోవడం సాధారణంగా చేస్తుంటాం. దీనితో రెండు రకాల నష్టాలు ఉన్నాయి. రోగనిరోధకశక్తి తగ్గిన కారణంగా మరింత ప్రభావకరమైన మందు వాడితే తప్ప మనకు వచ్చే జబ్బులు తగ్గకపోవడం మొదటిదైతే.. ఆ మందలు సైడ్ ఎఫెక్ట్స్ రెండో ప్రమాదంగా చెప్పవచ్చు. ఇలా మందుల జోలికి వెళ్లకుండా ఇంట్లో దొరికే మామూలు వంట పదార్థాలతో రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు. దీనితో తరచూ వచ్చే జబ్బులే కాదు.. కొన్ని రకాల దీర్ఘరోగాల బారిన పడే అవకాశం తగ్గుతుంది.
చిలగడదుంప
దీనే్న మోరంగడ్డ, గెనుసుగడ్డగా పిలుస్తారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచేందుకు ఉపయోగపడేవే.. ఇక ఇది మేనికి ఎంతో మెరుపునిస్తుంది. ప్రమాదకరమైన బ్యాక్టీరియల్, వైరల్ ఇన్‌ఫెక్షన్స్ నుంచి రక్షణనిస్తుంది. ఇక ఇందులో ఉండే చక్కెరల వల్ల గుండె, రక్తప్రసరణ వ్యసవ్థ, నాడీ వ్యవస్థకు బలం చేకూరుతుంది. ఇది మన శరీరంలోని గ్లూటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్థాయులను పెంచుతుంది. గ్లూటాథయోన్‌ను ‘మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్’ అని వ్యవహరిస్తారు. ఇది మన కణాల్లో పేరుకున్న విషాలను బయటకు పంపి, వాటిని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. అందుకే చిలగడదుంపలు తినేవారు ఆరోగ్యంగా ఉంటారు. మంచి జీవన నాణ్యతతో దీర్ఘకాలం బతుకుతారు. వర్షాలు పడుతున్న నేటి తరుణంలో ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలా రుచికరమైన చిట్కాలు. వీటితో పాటు అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవడం, ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తింటుండటం కూడా బాగా ఉపకరిస్తుంది.
చికెన్ సూప్
మాంసాహారం తినేవాళ్లైతే జలుబు, రొంప వంటి తరచూ సోకే ఇన్‌ఫెక్షన్లకు కమ్మటి చికిత్స చికెన్ సూప్. ఇది ఎన్నో ఏళ్లుగా అందరూ అనుసరిస్తున్న రుచికరమైన స్వాభావిక చికిత్సామార్గం. చికెన్ సూప్‌లో సిస్టిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. కోడి పులుసు పెట్టేటప్పుడు ఈ అమైన్ ఆసిడ్ విడుదల అవుతుంది. చికెన్, దాని ఎముకలతో చేసే సూప్‌లో మినరల్స్, పోషకాలతో మంచి వ్యాధి నిరోధకశక్తి చేకూరుతుంది. ఉదాహరణకు చికెన్ సూప్‌లో ఉండే జిలాటిన్ అనే అమైనో యాసిడ్ వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాదు.. చికెన్‌సూప్ అన్నది మంచి జీర్ణశక్తికి, కాలేయం పనితీరును మెరుగుపరచడానికి, ఎముకలను పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి
ఇది ఉల్లి జాతికి చెందిన వంట దినుసు. ఇది ఘాటుగా ఉండటం మాత్రమే కాదు.. ఎన్నో వ్యాధులపై కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తుంది. అనేక వ్యాధులను నిరోధిస్తుంది. దీనిలోని అల్లెసేన్ అనే పోషకం చాలా రకాల జబ్బులతో పోరాడి, వాటి నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్లిసిన్ ఒక ప్రభావపూర్వకమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా.. మనం తినే ఆహారాల్లో ఫ్రీ-రాడికల్స్ అనే పదార్థాలు అనేక దుష్ప్రభావాలను చూపి, వ్యాధులకు కారణమవుతాయి. అల్లిసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ-రాడికల్స్‌ను ప్రభావరహితం చేసేస్తుంది. అందుకే ఇది వ్యాధి నిరోధకతను పెంచడంతో పాటు ఎన్నో రకాల కేన్సర్లనూ నివారిస్తుంది. ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా తినేవారికి బాక్టీరియల్, ఫంగల్, వైరల్, పరాన్నజీవుల ఇన్‌ఫెక్షన్ల నుంచి మంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు.. శ్వాసకోశవ్యాధులున్నవారు వెల్లుల్లిని ఎక్కువగా వాడటం వల్ల వారికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
నిమ్మజాతి పండ్లు
నిమ్మజాతి పండ్లైన నారింజ, బత్తాయి, కమలాలు వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే ఇవి చాలా వ్యాధులకు మంచి రుచికరమైన నివారణ అని చెప్పవచ్చు. అంతేకాదు.. కణాలను నాశనం చేసి, ఏజింగ్‌కు తోడ్పడే ఫ్రీరాడికల్స్‌ను నారింజల్లోని హెస్పరిడిన్, హెస్పరెటిన్ వంటి బయోఫ్లేవనాయిడ్స్ సమర్థంగా అరికడతాయి. అందువల్ల వీటిని తినేవారు దీర్ఘకాలం యవ్వనంగా ఉంటారు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇవి ఎన్నో రకాల కేన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి బగా తోడ్పడతాయి. వీటిలో ఎక్కువ పీచు, తక్కువ కేలరీలు ఉండటం వల్ల స్థూలకాయం, బరువు తగ్గడానికి ఇవి బాగా ఉపకరిస్తాయి. దాంతో చాలా జబ్బులు తగ్గుతాయి.