Others

మనసులేని (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనసులేని బ్రతుకొక నరకం/ మరువలేని మనసొక నరకం/ మనిషికెక్కడ ఉన్నది స్వర్గం/ మరణమేగా దానికి మార్గం...’ -ఈ పాట సెక్రటరీ చిత్రంకోసం వ్రాసినది. గీత రచయిత ఆత్రేయ. సంగీత స్వరకర్త కెవి మహదేవన్. గాత్రం రామకృష్ణ. అత్యద్భుతంగా తెరకెక్కించిన దర్శకత్వ ప్రతిభాశాలి కెఎస్ ప్రకాశరావు. ఇది తెరవెనుక. ఇక తెరపైన అక్కినేని అభినయం ఇటు పండితులని, పామరులని మెప్పిస్తుంది. ఒప్పని ఒప్పిస్తుంది. ఇక నిర్మాతగా డి రామానాయుడు క్వాలిటీ విషయంలో రాజీపడని మనస్తత్వం. అందుకే పైన నుదహరించిన ప్రతిభాశాలురను తెరవెనుక, తెరపైన రప్పించారు. జనంకి దగ్గరగా తీసుకువెళ్ళి విజయపతాకం ఎగురవేశారు.
ఇక పాట లోతుల్లోకి వెళ్తే ఇది మూడు చరణాల ముచ్చటైన విషాద గీతం. మనసనేది ఒకరికొకరు ఇచ్చినపుడే తెలిసేది/ దాచుకుంటే ఎవరికీ అది దక్కకుండాపోతుంది/ ప్రేమనేది నీకు నీవే పెంచుకుంటే పెరిగేది/ పంచుకునే ఒక మనసుంటేనే బంధమై అది నిలిచేది. మరువలేనిది మాసిపోదు మాసిపోనిది మరలిరాదు/ రాని దానికై కన్నీళ్ళు... రాతి బొమ్మకు నైవేద్యాలు/ తరుముకొచ్చే జ్ఞాపకాలు... ఎదనుగుచ్చే గులాబి ముళ్ళు/ గురుతు తెచ్చే అందాలు... కూలిపోయిన శిల్పాలు... కన్ను నీదని వేలునీదని పొడుచుకుంటె రాదా రక్తం... రక్తమెంతగా దారపోసిన దొరుకుతుందా మళ్ళీ హృదయం-
ఒక రాజీపడని కథానాయకి ప్రేమని పొందలేక మధనపడే కథానాయకుడి మనోగతం... మనకవగతం చేయడం ఈ గీతంలోని సారాంశం. పాటలోని ఒక్కొక్క పంక్తి ఒక అగ్నికణంలా జరుపుతుంది రణం ‘అంతరంగంలో- అది గుండె గొంతుకుల జారి స్రవిస్తుంది పాట రూపంలో- ఇలాటి పాటని మనకందించిన ఆత్రేయలోని అంతర్మధనం అంతా ఈ సాంగు. అందుకే ఈ పాటంటే నాకు ఎంతో ఇష్టం-

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505