Others

పల్లెటూరి పిల్ల (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యన్టీఆర్, అక్కినేని కలసి నటించిన తొలి సినిమా. దర్శకుడిగా బిఏ సుబ్బారావుకూ ఫస్ట్ చిత్రం. ఆదినారాయణరావును సంగీత దర్శకుడ్ని చేసిన సినిమా -పల్లెటూరిపిల్ల. ఆదినారాయణరావు స్వయంగా ‘పల్లెసీమ అందమోయి’ అనే పాటనూ వ్రాశారు. మిగతా పాటలు తాపీ ధర్మారావు వ్రాశారు. ఆదినారాయణరావు కూర్చిన బాణీలు ప్రేక్షకులకు వినసొంపయ్యాయ. ముఖ్యంగా ‘శాంత వంటి పిల్లలేదోయి’, ‘్ధరపంపనా’, ‘జోరుగా హుషారుగా’ పాటలు ప్రేక్షకులను అలరించాయి. శ్రీదేవి, నరేంద్ర అనే నూతన గాయనీగాయకులతో పాడించటం, సంగీత దర్శకుడు టివి రాజు (ఆదినారాయణరావు అసిస్టెంటు), దర్శకుడు తాపీ చాణక్య (తాపీ ధర్మారావు కుమారుడు) ఒకానొక దృశ్యంలో కన్పించటం విశేషాలు. ఆంగ్ల నాటకం ‘పిజారో’ ఈ సినిమాకు ఆధారం.
యన్టీఆర్ ‘మనదేశం’ (1949) చిత్రంతో తెరగేంట్రం చేసినా, హీరోగా మొదటి సినిమా ఇదే. ధీరోదాత్తుడైన జయంత్ పాత్రను అద్భుతంగా పోషించాడు. కోడె దూడతో పోట్లాడే సన్నివేశాన్ని డూప్ లేకుండా చేయటంతో యన్టీఆర్ మణికట్టు విరగింది. అంజలీదేవితో చెంప దెబ్బతినే సీను చిత్రీకరణలో ఎక్కువ టేకులు తీసుకొని చెంప ఎర్రగా కందిపోయినా ఓపికతో యన్టీఆర్ నటించడం విశేషం. త్యాగధనుడు వసంత్‌గా అక్కినేని నటన ప్రేక్షకుల ప్రశంసలనందుకుంది. యన్టీఆర్, అక్కినేనిల సరసన శాంతిగా అంజలిదేవి నటన అపూర్వం. అక్కినేని పాత్రకు మొదట రఘురామయ్యను బుక్‌చేశారు. అయితే రఘురామయ్యకు ఫైట్స్ చేయటంలో అంత అనుభవం లేకపోవటంతో ఆయన్ని తొలగించి అక్కినేనిని తీసుకున్నారు. విలన్ పాత్రకూ మొదట యస్వీఆర్‌ని తీసుకున్నారు. ఆ టైంలో ఆయన తండ్రి మరణించటంతో ఆ వేషం మరొకరికి వెళ్లింది. అయితే అంజలిదేవి తాతగా యస్వీఆర్ కనిపిస్తారు. నల్లరామ్మూర్తి, సీతారాంలు ఈ చిత్రంతోనే హాస్యజంటగా స్థిరపడ్డారు. వారిద్దరు స్వయంగా పాడిన ‘చిటపట చినుకుల దుప్పటి తడిసెను తలుపుతియ్యవే భామా’ పాట చిత్రానికి హైలైట్. బిఏయస్, శోభనాచల పతాకంపై రూపొందిన సినిమా ఏప్రిల్ 1950లో విడుదలై ఘన విజయం సాధించింది.

- పూజారి నారాయణ