Others

‘రాములో రాముల..’ అంటున్న బన్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ కథానాయకుడుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ‘సామజవరగమన’ విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ‘రాములో రాముల..’ అన్న పాటను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తుందని దర్శక నిర్మాతలు అన్నారు. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రం అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాల మాదిరిగానే విజయవంతమై హ్యాట్రిక్‌గా నిలుస్తుందని వారు తెలిపారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా శరవేగంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుపుతున్నారు.