Others

ఊహించిన విజయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తి కథానాయకుడుగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై విడుదలైన చిత్రం ఖైదీ. ఈ చిత్రానికి అన్ని కేంద్రాలనుంచి మంచి ఆదరణ లభిస్తోందని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో సినిమా యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. దీపావళికి విడుదల చేసిన ఈ చిత్రం డిఫరెంట్ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని తెలిపారు. మంచి రేటింగ్‌తో వౌత్ టాక్‌తోనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని, పాటలు, హీరోయిన్, కామెడీ లాంటి అంశాలు ఏవీ లేకపోయినా రెండు గంటల 20 నిమిషాలపాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించారని, ఒక రాత్రి నాలుగుగంటల్లో జరిగే కథ అయినా మొదటినుండి చివరి వరకు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. సినిమా ప్రతివారికీ ఊహించిన దానికన్నా ఎక్కువగా నచ్చిందని, తమిళనాడులో కూడా మంచి సక్సెస్ అందుకుందని అన్నారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగులో అందించడానికి తన ప్రయత్నం చేస్తానని, సూర్య, కార్తి ప్రస్తుతం బిజీగా ఉండడంతో వారికి తగ్గ కథ దొరికితే తెలుగు చిత్రం చేయడానికి కూడా తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. అన్ని రకాల సోషల్ మీడియాల్లో ప్రమోట్ చేస్తున్నామని, ప్రేక్షకులకు త్వరగా అది రీచ్ అయ్యిందని, సినిమా సక్సెస్‌కు ఇది కూడా ఓ కారణమని ఆయన అన్నారు. ప్రస్తుతం తాను రూపొందిస్తున్న ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం 50 శాతం పూర్తయిందని, డిసెంబర్‌కల్లా సినిమా పూర్తిచేస్తామని అన్నారు. ఇది కూడా ఓ కాంటెంపరరీ ఇష్యూమీద సందేశాత్మకంగా రూపొందించిన చిత్రమని ఆయన వివరించారు.