Others

ట్రైలర్‌లో బ్లాక్ బోర్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌లో తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా సాయికృష్ణ దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా -బ్లాక్‌బోర్డ్. సినిమా ట్రైలర్‌ని హీరో ప్రిన్స్ విడుదల చేశాడు. ఈ సందర్భంగా ప్రిన్స్ మాట్లాడుతూ -బ్లాక్‌బోర్డ్ ట్రైలర్ బాగుంది. సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం మరింత ఆసక్తికరంగా ఉంది అన్నాడు. ముఖ్యఅతిథి, నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ -సాయికృష్ణని మెచ్చుకోవడంకంటే ముందు వాళ్ళ నాన్నని అభినందించాలి. పిల్లల ఇష్టం మేరకు నిర్మాతగా మారడం గొప్ప విషయం. సాయకృష్ణ చేసిన బ్లాక్‌బోర్డ్ సినిమా ముఖ్యంగా మాస్‌ని, క్లాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది అన్నారు. నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ -సినిమాని అనుకున్న టైమ్‌లో టీమ్ సపోర్ట్‌తో పూర్తి చేశాం. పోస్ట్‌ప్రొడక్షన్స్‌లో ఉన్న సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు. దర్శకుడు, హీరో సాయికృష్ణ మాట్లాడుతూ -ఇదొక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. కథకి తగ్గట్టుగా షూటింగ్ ఖమ్మం జిల్లాలోనే పూర్తి చేశాం అన్నారు. కార్యక్రమంలో మరో దర్శకుడు సయ్యద్, రాధకృష్ణ పులవర్తి, నూతన సినీ హీరోలు సాగర్ శైలేష్, అనిల్, చిన్న, రాజ్‌కుమార్, హీరోయిన్ మాధురి చిగురులు పాల్గొన్నారు.