Others

కమ్మ రాజ్యంలో.. ట్రైలర్ నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలు, సోషల్ మీడియా పోస్టింగులతో సంచలనం రేపే రాంగోపాల్‌వర్మ బయోపిక్‌లు, యదార్థ సంఘటనల ఇతివృత్తంతో సినిమాలు రూపొందించాడు. శివ మొదలుకొని ఇప్పటివరకు వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కిస్తూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన అగ్ర దర్శకుడు వర్మ. ఆయన నుంచి వస్తోన్న తాజా సంచలనం -కమ్మరాజ్యంలో కడప రెడ్లు. టైటిల్ చూస్తే ఇది రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య జరిగే కథ అనుకుంటాం. కాని ఇదొక -్ఫ్యక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపథ్యంగా సాగే కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న చిత్రం ట్రైలర్ ఆదివారం విడుదలవుతోంది. షూటింగ్ చివరి దశకు వచ్చిన సినిమాలో ఏడు పాటలున్నాయట. మరోవైపు నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని అని చిత్రబృందం వెల్లడించింది.