AADIVAVRAM - Others

ఆనంద దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతి తమసంబు అంతమ్ము గావింప
పువ్వొత్తులై వెల్గు పొదలజేయ
మానభంగముసల్పు మదమత్తులను ద్రుంచ
బాంబులై ప్రేల్చి ధ్వంసంబు జేయ
దుర్భాషలాడెడి దుష్టుల పరిమార్చ
విష్ణుచక్రములై వ్రేఁగజేయ
మాయమాటలు జెప్పు మంత్రగాండ్రను గూల్చ
సీమ టపాసులై చిత్తుచేయ

ఏకమై ప్రజలార! వివేకులగుచు
కదలి రారండు ఈ పర్వకాలమందు
అట్టి నరకాసుర గణమ్ము నణచివేయ
అపుడె దీపాల పండుగ యనగజెల్లు
అసలు సిసలైన ఆనందమమరగలదు
* * *
ఈ విశాల విశ్వమునందు హెచ్చె మునుపె
శబ్దకాలుష్యమెల్లెడ - చాలు చాలు
పర్వదినమున శబ్దాలు పరగజేసి
కర్ణ్భేరులు చీల్చి వికావికలుగ
చేయు బాంబులాది కాల్చ చెడుగు యగును
కాన వాని నిషేధింప కలుగు మేలు.
-కలవకొలను సూర్యనారాయణ
9849268659

తిమిరానికి శాపావళి
దీపావళి దీపావళి
తిమిరానికి శాపావళి
తీవ్ర జడత్వానికి ఆ
దిత్య కిరణ రూపావళి

నరకుని దుర్మార్గాలను
నరకు కరుకు ములుకులతో
నరకానికి పంపెను హరి
నారీమణి సత్యభామ

వీరనారి రూపానికి
విగ్రహమా సత్యభామ
విర్రవీగు రాక్షసులకు
వెన్నులోన చలి చీమ

మతం మసక తొలగించే
మతాబాలు వెలిగిద్దాం
కులం వ్యాధి తగ్గించే
కాకర ‘పువు’ తాకిద్దాం.

మచ్చరాలు బూదిచేయు
చిచ్చుబుడ్లు ముట్టిద్దాం
తారాతమ్యం నణచే
తారాజువ్వెగరేద్దాం

ఆడపిల్లలను తాకు మ
గాడి గుండె పగులునట్లు
టపాకాయ అగ్నిధ్వని
కోపాన్నిక చూపిద్దాం.
-కె.మధుసూదనరావు
9030907191

పంటల దీపమై పాడుతున్నాను

భాషను
తోకాడించే కుక్కపిల్లగా చేసి
సొంత అవసరాలు తీర్చుకుంటున్నారు కొందరు...

భాషను
ఎవరూ ఎక్కలేని కొండగా పేర్చి
మహదానందం పొందుతున్నారు కొందరు...

భాషను
పరిమళాలు పంచే పూల తోటగా తీర్చి
అనుభూతి పొందుతున్నారు కొందరు...

భాషను
అనంత కాంతి క్షేత్రంగా తీర్చిదిద్దుకొని
చీడ పీడల నుండి కాపాడుతున్నాను
ప్రజల కోసం భాస్వర స్వరాలు కూర్చుకొని
పంటల దీపమై పాడుతున్నాను.
-డా.రావి రంగారావు
9247581825