Others

‘నేతి సబ్బుల’తో చర్మానికి నిగారింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన పేర్లతో, ఆకట్టుకొనే నినాదాలతో మార్కెట్లో రకరకాల సబ్బులు..! ఎలాంటి అవగాహన లేకున్నా చర్మ సంరక్షణ కోసం ఆరాటపడుతూ రకరకాల సబ్బులను వాడేస్తుంటాం.. వైద్యుల సలహాలు గాని, కాస్మొటిక్ నిపుణుల సూచనలు గాని లేకుండా పలురకాల సబ్బులను వాడేస్తూ, చివరికి ఫలితం లేదని ఎంతోమంది పెదవి విరుస్తుంటారు.. అనేక రసాయనాలు కలిగిన సబ్బులను వాడడం వల్ల చర్మ సౌందర్యం మాట దేవుడెరుగు.. ఉన్న అందం కోల్పేయే ప్రమాదం లేకపోలేదు.. ఇలాంటి సందేహాల నడుమ ఎలాంటి సబ్బులు వాడాలన్న ప్రశ్నలు చాలామందిని వేధిస్తుంటాయి. ఈ సందేహాలకు విరుగుడుగా ముంబయికి చెందిన రాఖీ పిక్లే (38) తన ఇంట్లో సొంతంగా తయారుచేసిన సబ్బులతో ఎంతోమందికి ఉపశమనం కలిగిస్తున్నారు.
ఓ కార్పొరేట్ సంస్థలో పదేళ్లపాటు పనిచేసిన రాఖీ సొంతంగా సబ్బులు తయారుచేస్తూ అనూహ్య విజయం సాధించారు. చర్మానికి హాని చేసే రసాయనాలకు బదులు సహజ సిద్ధమైన మూలికలు, ఆకులు, నూనెలు, నెయ్యి వంటివి ఉపయోగించి ఆమె తయారుచేసే సబ్బులకు అనతికాలంలోనే గిరాకీ ఏర్పడింది. మంచి జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి, తన మూడేళ్ల కుమారుడి ఆలనాపాలనా చూసుకొంటున్న సమయంలో ఆమెకు సౌందర్య సాధనాల తయారీపై ఆసక్తి కలిగింది. తన కుమారుడికి స్నానం చేయించేటపుడు సాధారణ సబ్బులు, క్రీములు, మాయిశ్చరైజర్లు వంటివి వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతులను ఆమె ఎంచుకున్నారు. రసాయనాలు కలిగిన సబ్బులను వాడడం వల్ల చిన్నపిల్లల చర్మానికి చేటు జరుగుతుందని ఆమె గుర్తించారు. మూలికలు, ఆకులు, నెయ్యి, నూనెలు, శనగపిండి వంటివి ఉపయోగించి సులభ పద్ధతుల్లో ఇంట్లోనే సబ్బులు తయారు చేసి, వాటిని వాడేవారు. పర్యావరణ హితంగా సబ్బులు, క్రీములు, మాయిశ్చరైజర్లు వంటివి తయారు చేసేందుకు రాఖీ కొంత కాలం శిక్షణ శిబిరాలకు హాజరై అనేక విషయాలను అధ్యయనం చేశారు. చల్లటి వాతావరణంలో తయారుచేసే సబ్బులను మూడు నెలల్లోగా వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆమె చెబుతుంటారు. ఈ సబ్బులు వాడిన తర్వాత చర్మ సంరక్షణ ఆశాజనకంగా ఉందని చాలామంది వినియోగదారులు చెప్పడంతో ఆమె తన వ్యాపారాన్ని మరింతగా పెంచారు. మృదువైన చర్మం ఉన్నవారు సైతం వినియోగించేలా సబ్బులను తయారు చేయడం అవసరం అని ఆమె అంటారు. సహజ సిద్ధమైన వనరులు, నూనెలను వాడడం వల్ల చర్మానికి మంచి నిగారింపు వస్తుందని రాఖీ అంటున్నారు. తాను ఎన్నో రకాల సబ్బులను తయారుచేస్తున్నా, స్వచ్ఛమైన నెయ్యి- ఫ్రెంచి మట్టి కలయికతో రూపొందించిన సబ్బులకు మాత్రం మంచి పేరు వచ్చిందంటారు. ముందుగా ఈ సబ్బును తాను వినియోగించగా మంచి ఫలితాలు కనిపించాయని, ఆ తర్వాత ‘నేతి సబ్బు’కు మంచి ఆదరణ లభించిందని ఆమె చెబుతున్నారు. పర్యావరణానికి హాని కలిగించే పామ్ ఆయిల్‌కు బదులు ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనెలను సబ్బుల తయారీలో వాడితే ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. తాను తయారు చేసే సబ్బులను పేపర్ ప్యాకింగ్‌ల్లో, గాజుజాడీల్లో, డబ్బాల్లో విక్రయిస్తుంటారు. సబ్బుల తయారీ సాఫీగా సాగిపోతున్నా, ప్యాకింగ్, మార్కెటింగ్ విషయాల్లో సమస్యలు ఎదురవుతుంటాయని ఆమె చెబుతున్నారు. ప్యాకింగ్, మార్కెటింగ్ విషయాల్లోనూ పర్యావరణ పరిరక్షణకు ఆమె ప్రాధాన్యం ఇస్తుంటారు. సబ్బుల తయారీ కోసం ‘గ్రీన్ సేజ్’ అనే సంస్థను ఈ ఏడాది ఏప్రిల్ 9న రాఖీ ప్రారంభించారు. మహిళల నుంచి విశేష ఆదరణ వస్తున్నందున సబ్బుల తయారీని కుటీర పరిశ్రమగా ప్రారంభించి, ఆధునిక మార్కెటింగ్ పద్ధతుల్లో వాటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. సౌందర్య సాధనాల విషయంలో అందరికీ అవగాహన ఉండాలని, వివిధ రసాయనాల వల్ల చర్మానికి కలిగే నష్టం గురించి అప్రమత్తత అవసరమని ఆమె అంటున్నారు. తన వ్యాపారాన్ని మరింతగా విస్తృతం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకొన్న రాఖీ అందుకు తగ్గట్టుగా అనేక అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఆధునిక జీవనశైలిలో చర్మ సంరక్షణ కోసం ఏది పడితే అది వాడడం సరికాదని, సౌందర్య సాధనాలపై అవగాహన లేకుంటే లేనిపోని సమస్యలు తప్పవని ఆమె అంటున్నారు.
*