Others

చలికాలంలో నువ్వులనూనె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలంలో నీళ్లలో ఎక్కువగా పనిచేసే వారిలో పాదాలు, అరిచేతులు పాచినట్లు అవ్వడం, పగుళ్లు సర్వసాధారణమే.. ఆ ప్రాంతంలో చర్మం విడిపోయినట్లుగా, పగిలిపోయినట్లుగా అవుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే ఆ పగుళ్ల నుంచి రక్తం, చీముకారడం, దురద వంటి సమస్యలు కూడా తప్పవు. చెప్పులు లేకుండా నడిచినా, డిటర్జెంట్ సబ్బులు, వంటసోడా ఎక్కువగా చర్మానికి తగిలినా కూడా ఈ సమస్యలు ఎదురవుతాయి.. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే..
* నీళ్లలో పనిచేయడం పూర్తయిన వెంటనే పాదాలను గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుని, మెత్తటి వస్త్రంతో తడి పూర్తిగా పోయేలా తుడవాలి. ఆ తరువాత పాదాలకు నువ్వులనూనెతో మర్దన చేసుకోవాలి. ఈ నూనె చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
* వేపాకులను నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ నీళ్లు తగినంత వేడిగా ఉన్నప్పుడే పాదాలను అందులో పది నిముషాలు ఉంచాలి. ఆ తరువాత పొడి వస్త్రంతో తుడిచేసి నువ్వుల నూనెను రాయాలి.
* మాను పసుపుని కషాయంలా చేసుకుని 30 మిల్లీ లీటర్ల చొప్పున రెండు పూటలా తాగాలి. మాను పసుపుని గంధంలా చేసుకుని ఇనె్ఫక్షన్ ఉన్న భాగాల్లో పూతలా రాసుకోవాలి.
* నువ్వుల నూనెని వేడిచేసి పొయ్యిపై ఉండగానే, తేనె, మైనం ముక్కలు అందులో వేసి కరగనివ్వాలి. కరిగాక దింపేసి చల్లారనివ్వాలి. ఇలా తయారుచేసుకున్న ముద్దని పాదాలు, అరచేతులు, పగుళ్లు ఏర్పడిన భాగాలపై పూతలా పూసి, కాసేపయ్యాక కడిగేయాలి. వీటివల్ల ఫలితం ఉంటుంది.