Others

అయ్యా, అయ్యా.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో బాధలు, కష్టాలకోర్చి పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసేవారికి.. వారి పిల్లలు ఎలాగ గుణపాఠం నేర్పించారో తెలియచేసే సినిమాను నిర్మాత రాఘవ 1973లో నిర్మించారు. దాసరి నారాయణరావుని దర్శకుడుగా పరిచయం చేసిన ‘తాతమనవడు’ సినిమా అది. కథాసారాంశాన్ని ఒక పాటలో చెబుతూ, కుటుంబ నియంత్రణ ఎంత అవసరమో తెలియచెబుతూ రాసిన గీతమిది. అధిక సంతానంతో వారికి రోజుల పేర్లు పెట్టుకుని పిలుస్తూ.. భర్త అధిక సంతానంవల్ల కలిగే ఇబ్బందులు చెబుతుంటే, భార్య అందుకు వ్యతిరేకంగా అధిక సంతానం ఉండాలని వాదిస్తుండగా మధ్యలో ఒక యువకుడు ఒక దగ్గర గొయ్యి తవ్వుతుంటాడు. అది చూసి అతని కొడుకు ‘అయ్యా, అయ్యా ఎందుకు గొయ్యి?’ అని అడగ్గా.. తన తండ్రిని చూపిస్తూ ‘నాకొక పీడర మీ తాతయ్య, చావగొట్టి పాడెయ్యడానికే ఈ గొయ్య’ అంటూ జవాబు చెప్పగానే... అతని కొడుకు కూడా ఒక గొయ్య తవ్వడం చూసి ‘బాబూ, బాబూ నీకెందుకురా ఆ గొయ్య?’ అన్న ప్రశ్నకు ‘నీ అయ్యకు చేసే ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా. తాతకు వారసుడు మనవడేగా.. ఎప్పటికైనా తాతమనవడు ఒకటేగా’ అని కుర్రవాడు చెప్పిన జవాబుకు థియేటర్లో చప్పట్లు వర్షం, సినిమాలో ఆ యువకుడికి జ్ఞానోదయం. చివరిలో కుటుంబ సంక్షేమం కలగలిపి ‘పెద్దలనే సరిదిద్దే ఇలాంటి ఒకరిద్దరు చాలు. కనిపెంచినవాళ్లు తరిస్తారు. దేశానికి పేరు తెస్తారు’ అని చెప్పడంతో సినిమాలో హీరోఅయిన మనవడు తన తల్లిదండ్రులకు ఎలా పాఠం చెబుతాడన్న ఆసక్తిని కలగచేసిన ఈ గీత రచయిత సుంకరి. స్వర రచన రమేష్‌నాయుడు. బాలు, ఎల్‌ఆర్ ఈశ్వరి గాత్ర మాధుర్యం, రాజబాబు, విజయనర్మల సూపర్ అభినయంతో సినిమాకి హైలెట్‌గా నిలవడమేకాదు, నేడు తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేసి తమ సుఖం చూసుకుంటున్నవారికి, వృద్ధాశ్రమాలకు తరలిస్తున్న సంతానానికి కనువిప్పుగా నేటికీ ప్రేక్షక రంజకంగా వినిపిస్తున్న గీతం.