Others

తాసిల్దారుగారి అమ్మాయి (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1971లో విడుదలైన ‘తాసిల్దారుగారి అమ్మాయి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సత్య చిత్ర.. కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించింది. రచయిత్రి కావలిపాటి విజయలక్ష్మి ‘విధి విన్యాసాలు’ నవలకు సినిమా రూపమే ఈ సినిమా. కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా? అనే ప్రశ్నకు జవాబే ఇతివృత్తం. బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్న ఒక యువకుడిని తాసిల్దారుగారి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇష్టం లేకపోయినా.. విధిలేక పెళ్లి చేస్తారు యువతి మేనమామలు, కుటుంబీకులు. ఆ తరువాత వారిద్దరినీ విడగొట్టే ప్రయత్నాలు మొదలవుతాయి. తన భర్త వేరే యువతితో సినిమా చూస్తున్న దృశ్యం తాసిల్దారు అమ్మాయికి చూపించి, అనుమాన బీజాలు నాటతారు. దాంతో ఇద్దరి మధ్య అపోహలు తలెత్తుతాయి. పేదరికంలో ఉన్నవారికి తక్కువ బుద్ధులే ఉంటాయని గేలిచేస్తూ.. తన తండ్రి తాసిల్దారు కనుక మంచి బుద్ధులు ఉంటాయని, తన కొడుకును వాళ్ల దగ్గర పెంచుతానని మొండికేస్తుంది భార్య. అహం దెబ్బతిన్న భర్త.. తన కొడుకును కలెక్టర్ చేస్తానని సవాల్ చేస్తాడు. ఆ కారణంగా ఇద్దరూ దూరమవుతారు. చివరకు అనుకున్నది సాధిస్తాడు భర్త. కలెక్టర్ అయిన కొడుకు.. తన తల్లిదండ్రులు చిన్న కారణంతో విడిపోయారని తెలుసుకుని, తిరిగి కలపడానికి చేసిన ప్రయత్నాల్లోనూ సఫలుడవుతాడు. తండ్రీ కొడుకులుగా శోభన్‌బాబు ద్విపాత్రాభినయం అతడిని గొప్ప నటుడిగా నిలబెట్టింది. అప్పటికి అగ్ర హీరో అక్కినేని -శోభన్ నటనను ఎంతగానో ప్రశంసించారు. శోభన్‌కు జోడీగా జమున, చంద్రకళ తమ అభినయంతో ఆకట్టుకున్నారు. సినిమాలో ఎస్ వెంకటరత్నం ఫొటోగ్రఫీ, కెవి మహాదేవన్ సంగీతం హైలెట్. ఎన్‌ఆర్ నంది సంభాషణలు, ఆత్రేయ గీతాలు చిత్ర విజయంలో ముఖ్యపాత్ర పోషించాయి. కనబడని చెయ్యేదో (కెబికె మోహన్‌రాజ్), నీకున్నది నేనని (ఘంటసాల, సుశీల), పాడమన్నావు (సుశీల) గీతాలు ప్రేక్షకులను నేటికీ రంజింపచేస్తున్నాయి. మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమా శత దినోత్సవం జరుపుకుని శోభన్‌బాబు నటజీవితంలో మైలురాయిగా నిలిచింది.